T20 World Cup: చరిత్ర సృష్టించిన టీ20 వరల్డ్ కప్.. 500 మిలియన్లు దాటిన వ్యూయర్‌షిప్

T20 World Cup: చరిత్ర సృష్టించిన టీ20 వరల్డ్ కప్.. 500 మిలియన్లు దాటిన వ్యూయర్‌షిప్

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ దశకు చేరుకుంది. నేటి నుంచి సెమీ ఫైనల్ పోరు కొనసాగనుంది. అయితే ఈ పొట్టి వరల్డ్ కప్ వ్యూయర్‌షిప్ పరంగా చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది ఈ టోర్నమెంట్ లో జరిగిన మ్యాచులను చూసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ జై షా ఎక్స్ వేదికగా తెలిపారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే రికార్డు అని వెల్లడించారు. కాగా ప్రస్తుత పొట్టి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈవెంట్‌గా మార్చాలనే ఆశయంతో స్టార్ట్ చేసినట్లు పేర్కొన్నారు. భారతదేశంలో ఈ ఈవెంట్‌కు వీక్షకుల సంఖ్య 50 కోట్లు(500 మిలియన్లు) దాటింది అన్నారు. ఇది టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధికమని చెప్పుకొచ్చారు. జియో హాట్ స్టార్ వీక్షకుల సంఖ్య 6.05కోట్లకు (60.5 మిలియన్లు) చేరినట్లు తెలిపారు .

ఈరోజు నుంచి నాకౌట్ మ్యాచ్‌లు స్టార్ట్ కానున్నాయి. వీటిని కూడా భారత అభిమానులు వీక్షించి.. మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని ఆశిస్తున్నట్లు ఐసీసీ చెర్మన్ జై షా ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.. ఇదిలా ఉండగా.. ఈరోజు నుంచి సెమీ ఫైనల్స్  ప్రారంభం అవుతున్నాయి. సాయంత్రం  కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా వర్సెస్ -న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగనుంది. అలాగే రేపు  (మార్చి 5న ) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ -ఇంగ్లండ్ సెమీ ఫైనల్స్ 2లో పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లలో గెలిచిన టీమ్స్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.  మార్చి 8 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  
 
అయితే నాలుగు క్రికెట్ టీమ్స్ ఫైనల్ ట్రోఫీ కోసం తీవ్రంగా పోరాడుతుండగా అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. నాకౌట్ దశలో మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది. దీంతో వ్యూయర్‌షిప్ గణంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. టోర్నమెంట్ తుది ఘట్టానికి చేరుకుంటున్న వేళ అభిమానులు ఉత్సాహంగా, డిజిటల్ వేదికల ద్వారా ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ కి అపూర్వ స్పందన లభించడంతో చరిత్ర నిలిచిపోనుంది.