తొంబై రోజుల యాక్షన్ ప్లాన్ లో అందరి భాగస్వామ్యం ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.మార్చి 3న అన్ని జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు సీఎం.
►ALSO READ | రాజ్యసభ స్థానాలపై త్వరలో క్లారిటీ: మహేశ్ కుమార్ గౌడ్
ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలని కలెక్టర్లకు సూచించారు సీఎం రేవంత్. తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లుల చెల్లింపులు కచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 99 డేస్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు సీఎం.
