హైదరాబాద్ NRSCలో ఉద్యోగ అవకాశాలు : పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే జాబ్..

హైదరాబాద్ NRSCలో ఉద్యోగ అవకాశాలు :  పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే జాబ్..

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్​సీ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రీసెర్చ్ సైంటిస్ట్,  ప్రాజెక్ట్ సైంటిస్ట్ & ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 48. 

విభాగాల వారీగా ఖాళీలు: రీసెర్చ్ సైంటిస్ట్ 14, ప్రాజెక్ట్ సైంటిస్ట్ & ప్రాజెక్ట్ అసోసియేట్ 15, జూనియర్ రీసెర్చ్ ఫెలో 19. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎం.టెక్, ఎంఎస్సీ/ ఎంఎస్సీ టెక్నాలజీ, బీఈ/ బి.టెక్, బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. లేదంటే 10 పాయింట్ల స్కేలులో 6.5 సీజీపీఏ కలిగి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 1.

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరు రూ. 250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మన్, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజును రీఫండ్ చేస్తారు.  

లాస్ట్ డేట్: ఆగస్టు 21. 

సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి  రాత పరీక్ష ఉండదు. దరఖాస్తుల పరిశీలన తర్వాత షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.nrsc.gov.inను సందర్శించండి.