సూర్యాపేట జిల్లాలో రూ.20 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అందజేత

సూర్యాపేట జిల్లాలో రూ.20 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అందజేత

 సూర్యాపేట జిల్లాలో దాదాపు 20 లక్షల రూపాయల విలువైన ఫోన్లను బాధితులకు అందజేశారు జిల్లా ఎస్పీ నరసింహ. ఇటీవల చోరీలకు గురైన ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు.. సోమవారం (ఆగస్టు 03) బాధితులకు 102 మొబైల్స్ ఫోన్లను అందజేశారు.

సూర్యాపేట జిల్లాలో మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు అందించడం ఇది 14 వ సారి అని ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది కాలంలో 1846 మొబైల్స్ రికవరీ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 4 కోట్ల 80 లక్షల రూపాయల విలువైన ఫోన్స్ రికవరి చేసి బాధితులకు అందించినట్లు తెలిపారు.

 ప్రజల భద్రత, రక్షణలో రాత్రింబవళ్లు పోలీసు పని చేస్తుందన్నారు.  అత్యాశకు, దురాశకు పోతే సైబర్ మోసం తప్పదని హెచ్చరించారు.  రోడ్డు ప్రయాణ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. 

 మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.  డ్రగ్స్, గంజాయిని మన సమాజం నుండి వెలివేయాలని అందుకోసం ప్రజలు సహకరించాలని కోరారు.