అమెరికా.. ఇరాన్ యుద్ధం శ్రీలంక వరకు వచ్చింది. శ్రీలంక సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఇరాన్ దేశానికి చెందిన నౌకపై.. జలాంతర్గామి ఎటాక్ చేసింది. ఈ దాడిలో షిఫ్ బాగా దెబ్బతిన్నది. నౌక నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దాడి తర్వాత ఇరాన్ నౌక నుంచి శ్రీలంక నేవీకి సంకేతాలు వచ్చాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీలంక నేవీ రంగంలోకి దిగింది. నౌకలోని 78 మందిని రక్షించారు. అప్పటికే నౌకలోని 101 మంది గల్లంతు అయ్యారు. వాళ్ల కోసం గాలిస్తున్నారు శ్రీలంక నేవీ అధికారులు. శ్రీలంక రక్షించిన 78 మందిలో 32 మంది గాయపడ్డారని.. వాళ్లను నేవీ ఆస్పత్రిలో చేర్పించినట్లు శ్రీలంక రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ : హార్ముజ్ మూసేయొద్దు..ఇరాన్ కు సూచించిన చైనా
ఇరాన్ దేశానికి చెందిన ఇరానియన్ నేవీ ప్రిగేట్ ఐరిస్ దేవా అనే ఈ నౌక.. శ్రీలంక తీరం మీదుగా ఇరాన్ వెళుతున్నది. ఈ క్రమంలోనే దక్షిణ శ్రీలంక తీరంలో ఓ జలాంతర్గామి ఎటాక్ చేసింది. దాడి తర్వాత ఇరాన్ నౌక నుంచి ఎమర్జెన్సీ సంకేతాలు శ్రీలంక నేవీకి వెళ్లాయి. వాళ్లు నౌక దగ్గరకు వచ్చి.. నౌకలోని వాళ్లను కాపాడారు. ఈ నౌకలో మొత్తం 180 మంది ఉన్నారని.. అందులో 101 మంది గల్లంతు అయినట్లు చెబుతోంది శ్రీలంక రక్షణ శాఖ.
ఇరాన్ నౌకపై.. శ్రీలంక తీరంలో ఎటాక్ చేసిన జలాంతర్గామి ఏ దేశానికి చెందినవి.. ఎవరు దాడి చేశారు అనేది ఇంకా వెల్లడికాలేదు.
ఇటీవల విశాఖపట్నంలో అంతర్జాతీయ నౌకాదశ విన్యాసాలు జరిగాయి. ఈ క్రమంలోనే పాల్గొనేందుకు ఇరాన్ దేశం నుంచి ఈ నౌక వైజాగ్ వచ్చింది. 2026, ఫిబ్రవరి చివరి వారంలో ఈ విన్యాసాలు జరిగాయి. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత.. ఈ నౌక తిరిగి ఇరాన్ దేశం బయలుదేరింది. వైజాగ్ తీరం దాటి శ్రీలంక సముద్ర జలాల మీదుగా ఈ నౌక ప్రయాణిస్తున్న సమయంలో దాడికి గురైంది. ఇరాన్ దేశంపై యుద్ధం జరుగుతున్న క్రమంలోనే.. శ్రీలంక తీరంలో ఓ జలాంతర్గామి ఈ ఇరాన్ నౌకపై దాడి చేసింది. నౌక నుంచి వచ్చిన ఎమర్జెన్సీ సాయానికి స్పందించి.. శ్రీలంక నేవీ ఈ నౌకలోని ఇరాన్ దేశస్తులను కాపాడింది.
