కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది...ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 

కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది...ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 
  • ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయి

కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. అన్ని జిల్లాల డీఎమ్హెచ్వోలు,  ప్రోగ్రాం ఆఫీసర్లు,  ఇతర అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వాక్సినేషన్, జ్వర సర్వే తదితర అంశాలపై ఈ సందర్భంగా వారితో సమీక్షించారు. వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలన్నారు మంత్రి హరీష్ రావు. ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వచ్చాయన్న మంత్రి.. వైద్య సిబ్బందికి ప్రత్యేక అభినందలు తెలిపారు. 18 ఏళ్లకు పైబడిన వారికి రెండు డోసులు పూర్తి చేసిన కరీంనగర్, హనుమకొండ జిల్లాలను.. 15-17 ఏళ్ల కేటగిరీలో 100 శాతం పూర్తి చేసి మొదటి జిల్లాగా నిలిచినందుకు హన్మకొండ జిల్లాల అధికారులను మంత్రి అభినందించారు. ఇతర జిల్లాలు ఈ రెండు జిల్లాలను స్ఫూర్తిగా తీసుకుని త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు హరీష్ రావు.

ఇవి కూడా చదవండి...

లతాజీ మరణంతో పాట మూగ బోయింది

ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన మెగాస్టార్