KuberaaBookings: కుబేర బుకింగ్స్లో తెలుగు, ఓవర్సీస్ పర్లే.. తమిళంలో కనిపించని ధనుష్ హవా!

KuberaaBookings: కుబేర బుకింగ్స్లో తెలుగు, ఓవర్సీస్  పర్లే.. తమిళంలో కనిపించని ధనుష్ హవా!

ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ ‘కుబేర’.రష్మిక హీరోయిన్‌‌. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన మూవీ.. రేపు శుక్రవారం (జూన్ 20న) రిలీజ్ కానుంది.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల సినిమా అంటేనే.. సాధారణంగా భారీ హైప్ ఉంటుంది. అలాంటిది టీజర్, ట్రైలర్ ఆడియన్స్కు నచ్చాయంటే.. ఇక చెప్పేదేముంది? టికెట్ల కోతే!.. 'ఎస్.. ఇది నిజమే'. 

‘కుబేర’ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. బుక్‌మైషో మరియు ఇతర టికెటింగ్ యాప్‌ ప్లాట్‌ఫామ్‌లలో కుబేరా ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లోనే దాదాపు 12 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ ఊపు ఇలాగే కొన‌సాగితే.. కుబేర‌కు బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్ వ‌స్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కుబేర బుకింగ్స్:

బిచ్చగాడు వెర్సస్‌ బిలియనీర్ కథగా వస్తోన్న సినిమాను చూడటానికి.. సినీ ఫ్యాన్స్ ఉత్సాహం మరింత పెరిగడంతో బుకింగ్స్ ఊపుమీద ఉన్నాయి. నైజాం ఏరియాలో బుకింగ్స్ సూపర్బ్గా ఉన్నాయి. అయితే, కుబేర బుకింగ్స్ తెలుగు రాష్ట్రాలలో ఫర్వాలేదనిపిస్తున్నా.. తమిళనాడులో మాత్రం అసలు బజ్ లేదని టాక్. అదేంటీ? తమిళ స్టార్ హీరో ధనుష్ ఉన్నప్పటికీ బుకింగ్స్ జరగకపోవడమేంటీ? అనుకుంటున్నారా? 

►ALSO READ | Vishnu Manchu: కన్నప్పతో కొడుకు అవ్రామ్ అరంగేట్రం.. విష్ణు ఎమోషనల్ పోస్ట్.. తెరవెనుక వీడియో షేర్

వాస్తవానికి తమిళంలో కుబేరాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించాయి. అందుకు ముఖ్య కారణం హీరో ధనుష్. కానీ,  ట్రేడ్ వర్గాలు అంచనాలకు భిన్నంగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ధనుష్ క్రేజ్, ఇమేజ్‌కు తగినట్టుగా ఓపెనింగ్స్ లేకపోవడం బిజినెస్ వర్గాలను షాక్ ఇచ్చింది.

కుబేరాకు తమిళనాడు ఓపెనింగ్ డే అడ్వాన్స్ సేల్స్ 1.10 కోట్లు మాత్రమే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది ధనుష్ క్రేజ్ కు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.

యూఎస్‌లో ఇప్పటికే ఈ సినిమా 100K డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతానికి కుబేర మీద ఉన్న హైప్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలలో బాగానే బిజినెస్ చేసుకుంటోంది. తమిళంలో కూడా ఊపు రావాలంటే.. ప్రీమియర్ షో పడాల్సిందే. అప్పుడే దుమ్ములేసిపోవాలి అని ధనుష్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ధనుష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఓవర్సీస్ బుకింగ్స్:

కుబేరా మూవీ USA లోనే 803 ప్రదర్శనలలో $193,250 (రూ.1.65 కోట్లు) వసూలు చేసింది. రేపు ప్రీమియర్ రోజుకు ముందే 11,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కెనడా మరియు ఉత్తర అమెరికాలోని ఇతర ప్రాంతాల నుండి టికెట్స్ బుకింగ్స్ బలంగా ఉన్నాయి.

ఇప్పటివరకు మొత్తం ప్రీమియర్ అడ్వాన్స్ కలెక్షన్లు $210,000 కు చేరుకున్నాయి. ముఖ్యంగా జూన్ 18న, USAలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. ఒక్కరోజే $115,800 వద్ద ఉన్నాయి. 24 గంటల్లోనే, ఈ సంఖ్య 66.9% పెరిగింది. నేడు ప్రీమియర్స్ కు మౌత్ టాక్ బలంగా ఉంటే.. కుబేరా ఈ సంవత్సరం ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి మెరుగైన ప్రదర్శన ఇవ్వడం కన్ఫర్మ్. 

కుబేర కథ గురించి:

ధనిక, మధ్య తరగతి, పేద అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో జరిగే కథ ఇది. చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఈ దేశంలో నీతి, న్యాయం కాదు డబ్బు, పలుకుబడి పనిచేస్తాయని చెప్పే నాగార్జున పవర్ ఫుల్ రిచ్ పర్సన్ గా కనిపిస్తున్నాడు. ధనవంతులు, శక్తిమంతులే ఎప్పుడూ ప్రపంచాన్ని ఏలుతారని రష్మిక మందన్నా క్యారెక్టర్ లో ఉంది.  ఏమి తెలియని ఒక బిచ్చగాడి పాత్ర. 

వాస్తవికతకు దగ్గరగా ఉంటూనే శేఖర్ కమ్ముల ఓ థ్రిల్లింగ్ పాయింట్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కించాడు. సింపుల్‌‌‌‌‌‌‌‌గా చెప్పాలంటే బిలియనీర్ వర్సెస్‌‌‌‌‌‌‌‌ బెగ్గర్ కథ ఇది. అసలేమీ ఆశించని బిచ్చగాడు, అన్నీ కావాలనుకునే ధనికుడికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ.