జైలర్ సూపర్ హిట్.. చిరు, రజని ఇష్యూపై నో కామెంట్స్ : దిల్ రాజు

జైలర్ సూపర్ హిట్.. చిరు, రజని ఇష్యూపై నో కామెంట్స్ : దిల్ రాజు

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన జైలర్(Jailer) సినిమా ఈరోజు(ఆగస్టు 10)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకుంటున్నారు. 

ఇక జైలర్ సినిమాను తెలుగులో దిల్ రాజు(Dil Raju), సునీల్ నారంగ్(Sunil Narang) సంయుక్తంగా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా జైలర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు దిల్ రాజు అండ్ సునీల్ నారంగ్. ఈ సంధర్బంగా సునీల్ నారంగ్ మాట్లాడుతు.. జైలర్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను మాకు ఇచ్చినందుకు సన్ పిక్చర్స్ వారికి, ఇంతపెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. 

ఇక నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమాకు ఒకటే టాక్ వస్తోంది. సూపర్ హిట్.. సూపర్ హిట్. రజినీకాంత్ లాంటి స్టార్ హీరోకు మంచి కంటెంట్ పడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో జైలర్ మళ్ళీ ప్రూవ్ చేసింది. అందుకు తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ వివరాలు మరో రెండురోజులు గడిస్తేగానీ చెప్పలేం. కానీ రికార్డ్ కలెక్షన్స్ వస్తాయి. ఇక ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. 

ఇందులో భాగంగా మీడియా సభ్యులు.. దిల్ రాజును రజనీకాంత్ చేసిన కామెంట్స్ గురించి, ఇటీవల చిరంజీవి(Chiranjeevi) చేసిన కామెంట్స్ గురించి ప్రశ్నించారు. దానికి సమాధానంగా దిల్ రాజు.. ఇది జైలర్ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్. దయచేసి కాంట్రావర్సీ టాపిక్స్ ఇక్కడ ప్రస్తావించకండి. బీ పాజిటీవ్. పాజిటీవ్ ప్రశ్నలు అడగండి అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.