హీరోలు ఆకాశం నుంచి ఊడి పడ్డారా.. : సినీ ఇండస్ట్రీని గెలికిన విజయసాయి

హీరోలు ఆకాశం నుంచి ఊడి పడ్డారా.. : సినీ ఇండస్ట్రీని గెలికిన విజయసాయి

సినీ ఇండస్ట్రీతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫైటింగ్ మరింత ముదిరిగింది. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్ తో పీక్ స్టేజ్ కు వెళ్లింది. సినిమా వాళ్లు అయితే ఏంటీ.. వాళ్లేమయినా దేవుళ్లా.. ఆకాశం నుంచి ఊడిపడ్డారా అంటూ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 

ఇంతకీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం... కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ.. లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్. అంటూ ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్ లో..  సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంటూ మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ అటూ రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారాయి. మరి విజయసాయి రెడ్డి చేసిన ఈ కామెంట్స్ కు చిరు తరుపునుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.