గుంటూరు కారంలో.. మహేష్ బాబు వేసుకున్న చొక్కా రూ.75 వేలా!

గుంటూరు కారంలో.. మహేష్ బాబు వేసుకున్న చొక్కా రూ.75 వేలా!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు(Mahesh babu), మాటలా మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). ఈ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో.. గుంటూరు కారం సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. శ్రీలీల(Sreeleela),మీనాక్షి చౌదరి(Meenakshi choudary) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. 

ఇదిలా ఉంటే తాజాగా ఆగస్టు 9 మహేశ్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా..  గుంటూరు కారం సినిమా నుండి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో మహేశ్‌.. లుంగీ కట్టుకొని మాస్‌ లుక్‌లో అదరగొట్టేశాడు. కళ్ళకి బ్లాక్ కలర్ కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని బీడీ కాలుస్తూ..  మాస్ గాడ్ లా దర్శనమిచ్చారు. దీంతో ఈ పోస్టర్‌ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. 

అంతేకాదు ఈ పోస్టర్‌లో మహేశ్‌ వేసుకున్న షర్ట్‌ ఆడియన్స్ ను తెగ అట్రాక్ట్‌ చేస్తోంది.  దీంతో  ఆ షర్ట్ ఏ బ్రాండ్‌? దీని ధరెంత? అనే విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్స్. సాధారణంగా.. స్టార్ వాడే కాస్ట్యూమ్స్‌, గాడ్జెట్స్, వాచెస్‌, షూస్‌ వంటివి చాలా కాస్ట్లీ గా ఉంటాయి. పోస్టర్ లో మహేశ్‌ వేసుకున్న షర్ట్‌ కాస్ట్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఈ షర్ట్ ధర గురించి గూగుల్‌ చేయగా.. దిమ్మతిరిగే బొమ్మ కనిపించింది. ఎందుకంటే మహేశ్‌ బాబు వేసుకున్న ఆ షర్ట్‌ ధర అక్షరాల రూ.74,509. ఫ్యాషన్ ఫార్‌ఫెచ్ R13కు చెందిన ఈ షర్ట్‌ ధర చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.