నేను ఎక్కడున్నా నువ్వు నా గుండెల్లోనే.. సుధీర్ కామెంట్స్ వైరల్

నేను ఎక్కడున్నా నువ్వు నా గుండెల్లోనే.. సుధీర్ కామెంట్స్ వైరల్

బుల్లితెరపై సుధీర్(Sudigali Sudheer), రష్మీ(Rashmi) జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం ఈ ఇద్దరి క్రేజ్ మాత్రమే బేస్ చేసుకొని డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్ కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ మిలియన్స్ వ్యూస్ తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. కానీ ఏమైందో తెలియదు కానీ.. గత కొంత కాలంగా ఈ జంట బుల్లితెరపై ఎక్కువగా కనిపించడంలేదు. 

అయితే తాజాగా మరోసారి ఈ జంట ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ ఛానల్ లో ప్రసారంకానున్న కొత్త ప్రోగ్రాం కోసం సుధీర్, రష్మీ జతకట్టారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో చాలా మంది సెలబ్రెటీస్ కనిపించారు కానీ.. సుధీర్, రష్మీ మాత్రమే సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచారంటే అతిశయోక్తికాదు.

ALSO READ: King of Kotha: దుల్కర్ సల్మాన్ యాక్షన్-థ్రిల్లర్.. కింగ్ ఆఫ్ కోతా ట్రైలర్‌ రిలీజ్

ఇక ప్రోమోలో సుదీర్ రష్మిని ఉద్దేశిస్తూ.. మేడం గాడు ఎందుకో కొంచం కోపంగా ఉన్నట్టున్నారు అంటాడు. దానికి రష్మీ.. మరి నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురుచూశాను. ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నావు అంటుంది. దానికి సుధీర్.. నేను ఎక్కడున్నా నువ్వుమాత్రం నా గుండెల్లో ఉంటావ్ కదా అంటాడు. ఇద్దరి మధ్య సాగిన ఈ సంభాషణ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఆడియన్స్ సైతం ఈ ప్రోగ్రాం చూసేందుకు ఫుల్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అంతేకాదు చాలా గ్యాప్ తరువాత సుధీర్, రష్మీ కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తుండటంతో ఈ ఈవెంట్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అతి త్వరలో టెలికాస్ట్ కానున్న ఈ ప్రోగ్రాం ఏ రేంజ్లో టీఆర్ఫీ సాధిస్తుందో చూడాలి.