జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలా మంది సంఖ్యా శాస్త్రం ద్వారా తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం, 2026 సంవత్సరంలో మానిఫెస్టేషన్ క్యాలెండర్ లో కొన్ని తేదీలకు చాలా శక్తి కలిగి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏఏ తేదీలు దేనికి ప్రాముఖ్యత నిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 2026 అనేది నెంబర్ 1ను సూచిస్తుంది . అది ఎలాగంటే 2 + 0 + 2 + 6 = 10.... 1 + 0 = 1.. ఇలా నెంబర్ 1 సంవత్సరం పునరావృతమయ్యే తేదీలు చాలా ఉన్నాయి. సాధారణంగా నెంబర్ వన్ సంఖ్యకు చాలా శక్తి కలిగి ఉంటుందని న్యూమరాలజీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
111 పోర్టల్ .. జనవరి 1, 2026: ఈ తేదీ ఇప్పటికే గడచిపోయింది. ఈ తేది ప్రాముఖ్యతను పరిశీలిస్తే జనవరి 1 వ తేదీని 1–1–2026 ( 1+1+2+0+2+6 = 10... 1+0= 1 )అని రాస్తాం కదా.. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ రోజు 111 పోర్టల్ కలిగి ఉంది. 1 వ నెల 1 వతేది 2026 కలిపితే 1 వచ్చింది కదా..! ఈ సంఖ్య విశ్వాన్ని రీసెట్ చేసిందని మరల నెంబర్ 1 నుంచి ప్రారంభమైందని సంఖ్యా శాస్త్రనిపుణులు చెబుతున్నారు.
2/2 పోర్టల్ (ఫిబ్రవరి 2): ఈ తేదీన ముఖ్యమైన పనుల విషయంలో దృష్టి పెట్టాలని సంఖ్యాశాస్త్రనిపుణులు చెబుతున్నారు.
8/8 లయన్స్ గేట్ (ఆగస్టు 8): ఈ తేది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు ప్రారంభించిన పనుల వలన ఉన్నత స్థితిని పొందుతారు.
11/11 పోర్టల్ (నవంబర్ 11): ఆ రోజు అన్ని విధాల అనుకూలమైన రోజు. గతంలో ఆగిపోయిన పనులను తిరగి ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని సంఖ్యాశాస్త్ర జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
12/12 పోర్టల్ (డిసెంబర్ 12): కొత్త పనులు చేయడాని ప్రణాళికను తయారు చేసుకొనేందుకు మంచి రోజు.
ఈ ఏడాది (2026) చాలా గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. వీటి వలన వ్యక్తిగత జీవితాల్లో మార్పులు కలుగుతాయి. జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ప్రారంభంలో .. నెప్ట్యూన్, శని ఈ రెండు గ్రహాలు మేషరాశిలోకి ప్రవేశిస్తాయి.
ALSO READ : జనవరి 6 అద్భుతమైన రోజు..
- జనవరి 26: నెప్ట్యూన్ మేషరాశిలోకి ప్రవేశిస్తుంది.
- ఫిబ్రవరి 13: శని మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.
- ఆగస్టు 12 : సింహరాశిలో సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈగ్రహణం ప్రతి వ్యక్తికి శక్తి కేంద్రంగా పని చేస్తుంది. గ్రహణాలు తరచుగా వైల్డ్ కార్డ్స్ లాగా పనిచేస్తాయి
- మార్చి 20 (వసంత విషువత్తు ) : ఆ రోజు పగలు.. రాత్రి వేళలు సమానంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్లు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు ..
- జూన్ 21 ( వేసవి అయనాంతం) : ఆరోజు ప్రకాశవంతమైన రోజు .. కెరీర్లో ఉన్నత స్థానాన్ని పొందుతారు.
- సెప్టెంబర్ 22 (శరదృతువు విషువత్తు): పంటకోత పోర్టల్. ...
- డిసెంబర్ 21 (శీతాకాల అయనాంతం ) : ప్రతి జీవిలో దాగిఉన్న అంతర్గత శక్తి.. ఆత్మపరిశీలన చేసుకొనేందుకు ఉత్తమమైనది.
ఈ రోజులు ఏం చేయాలి
- తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకొని.. 27 నిమిషాలు ధ్యానం చేయండి
- మీ కుల దేవతను ఆరాధించండి
- గ్రహణాల సమయంలో.. మీ భయాలను కాగితంపై వ్రాసి, రావి చెట్టు కొమ్మకు కట్టండి .
