టీచర్లకు అమెరికాలో ఫ్రీ ట్రైనింగ్.. ‘ఫుల్బ్రైట్’ ఫెలోషిప్కు దరఖాస్తుల ఆహ్వానం

టీచర్లకు అమెరికాలో ఫ్రీ ట్రైనింగ్.. ‘ఫుల్బ్రైట్’ ఫెలోషిప్కు దరఖాస్తుల ఆహ్వానం
  • మార్చి 6 వరకూ చాన్స్ 
  • ఐదేండ్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్ ఉన్న టీచర్లు అర్హులు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు అమెరికాలో ఉచితంగా శిక్షణ పొందే చాన్స్  లభించనుంది. 2026–-27 సంవత్సరానికి ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్రైట్  టీచింగ్  ఎక్సలెన్స్  అండ్  అచీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్  ప్రోగ్రామ్  కింద స్కూల్  ఎడ్యుకేషన్  అధికారులు అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నారు.

 ఎంపికైన వారు ఆరు వారాల పాటు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో ఉంటూ శిక్షణ పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అయ్యే మొత్తం ఖర్చును అమెరికా ప్రభుత్వమే భరించనున్నది. వీసా సపోర్ట్, రానుపోను విమాన ఖర్చులు, అమెరికాలో ఉండడానికి వసతి, భోజనం, శిక్షణా ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్, రోజువారీ ఖర్చుల కోసం అలవెన్స్  వంటివన్నీ సంస్థే ఇవ్వనుంది.

 దరఖాస్తులను మార్చి 6లోగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసుకోవాలంటే టీచర్లు కచ్చితంగా ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (సెకండరీ స్కూల్) విద్యార్థులకు పాఠాలు చెప్తున్న వారు అయి ఉండాలి. అప్లికేషన్  నాటికి కనీసం ఐదేండ్ల బోధనా అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్, స్పెషల్  ఎడ్యుకేషన్  సబ్జెక్టులు బోధించే టీచర్లు మాత్రమే దీనికి అర్హులని అధికారులు ప్రకటించారు. 

అయితే, అమెరికా వెళ్లాలంటే ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పట్టు ఉండాల్సిందే. అందుకే ఎంపిక ప్రక్రియలో భాగంగా టోఫెల్  పరీక్షలో కనీసం 45 శాతం స్కోర్  సాధించాల్సి ఉంటుంది. ఎంపికైన టీచర్లకు అమెరికాలో ఉండే ఆరు వారాల కాలాన్ని ప్రభుత్వం ‘ఆన్ డ్యూటీ’ (ఓడీ) గా పరిగణిస్తుంది. 

అక్కడ బోధనా పద్ధతులు, సబ్జెక్ట్  నాలెడ్జ్  పెంపొందించుకోవడంతో పాటు, సాంస్కృతిక మార్పిడికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రోగ్రాం కింద ఎంపికైన టీచర్లు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఆరు వారాల పాటు అకడమిక్ రెసిడెన్సీలో పాల్గొంటారు. ఎంపికైన వారికి వచ్చే ఏడాది జనవరి లేదా సెప్టెంబర్ లో రెండు బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా ఈ శిక్షణ ఉంటుంది. 

అప్లై ఇలా.. 

'ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్రైట్ టీచింగ్  ఎక్సలెన్స్  అండ్  అచీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్' ప్రోగ్రామ్ ఆసక్తి, అర్హత ఉన్న టీచర్లు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. వివరాలకు www.usief.org.in వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించాలని సూచించారు. సందేహాలుంటే ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ఫ్యాకల్టీ 97051 63872 నంబర్ ను సంప్రదించాలన్నారు. 

అయితే, అప్లికేషన్  రాసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే అనర్హులుగా ప్రకటిస్తారు. కాగా, మార్చి 6 వరకు www.usief.org.in](https://www.usief.org.in) వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.