Team India: టీమిండియాకు బిగ్ షాక్.. సూపర్–8కి ముందు స్టార్ ప్లేయర్ కి గాయం

Team India: టీమిండియాకు బిగ్ షాక్.. సూపర్–8కి ముందు స్టార్ ప్లేయర్ కి గాయం

Team India: సొంతగడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌-2026లో భారత జట్టు దూసుకుపోతోంది. లీగ్‌ దశలో వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లతో జరిగిన మ్యాచులలో ఘన విజయం సాధించింది. గ్రూప్‌-ఎ నుంచి సూర్యకుమార్‌ సేన సూపర్‌-8కు టాపర్‌గా అర్హత సాధించింది. వరుస విజయాలు నమోదు చేసి ఆత్మవిశ్వాసంతో నెక్ట్స్ దశలోకి అడుగు పెట్టింది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందే టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ కి ముందు నుంచి భారత జట్టుకి గాయాలు వదలడం లేదు.. యంగ్ పేసర్‌ హర్షిత్ రాణా గాయంతో టోర్నీకి దూరం కాగా, అతడి స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సిరాజ్‌ నిన్న గాయపడ్డాడు. అంతుకు ముందు పేసర్‌ జస్పిత్ బుమ్రా సైతం జ్వరంతో రెండు మ్యాచులకి దూరం కూడా అయ్యాడు.  

సూపర్-8లో రేపు సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ కి ముందు భారత జట్టుకి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న ( ఫిబ్రవరి 20న) నెట్ లో పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయపడినట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తూ కొట్టిన బంతి సిరాజ్ మోకాలికి బలంగా తగలడంతో నొప్పితో మైదానాన్ని వీడినట్లు చెప్తున్నారు. సిరాజ్ గాయం తీవ్రతపై జట్టు మేనేజ్మెంట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అటు జట్టు కూడా ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్ లో ఉందంటూ ప్లేయర్ల ఫొటోలను BCCI ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ లో షేర్ చేసింది.

ALSO READ : ఇండియా ఫుల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌.. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అపజయం లేకుండా దూసుకుపోతున్న టీమిండియా

ఇప్పుడే టీ20 ప్రపంచ కప్ 2026లో అసలు సమరం స్టార్ట్ అయింది. గ్రూప్‌-1లో ఉన్న భారత్‌ సూపర్‌-8లో తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రేపు (ఫిబ్రవరి 22న) రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌కు చేరుకున్న టీమిండియా నెట్‌ సెషన్లలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పటికే కీలకమైన సూపర్‌-8 దశలోకి అడుగు పెట్టిన భారత్.. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఎదుర్కొనుంది. సెమీ ఫైనల్‌ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ దశలో ప్రతి మ్యాచులో తప్పక గెలవాల్సిందే. దక్షిణాఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్‌ గాయం టీం వ్యూహాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.