మెన్స్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ లో...సెమీస్‌‌ లోకి దూసుకెళ్లిన నటరాజన్‌‌

మెన్స్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ లో...సెమీస్‌‌ లోకి దూసుకెళ్లిన నటరాజన్‌‌

గ్లాస్గో:  ఇండియా స్విమ్మర్‌‌ శ్రీహరి నటరాజన్‌‌.. మెన్స్‌‌ 50 మీటర్ల బ్యాక్‌‌స్ట్రోక్‌‌లో సెమీస్‌‌లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన హీట్స్‌‌లో నటరాజన్‌‌ 25.52 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో ప్లేస్‌‌లో నిలిచాడు. ఓవరాల్‌‌గా 14వ ప్లేస్‌‌తో సెమీస్‌‌లోకి ప్రవేశించాడు. పారా స్విమ్మింగ్‌‌లో ఆర్‌‌వీవీబీకే బుడిగినా, ఇమామ్‌‌ అలీ.. 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌‌ ఎస్‌‌–13 ఈవెంట్‌‌లో ఫైనల్‌‌కు చేరారు. బుడిగినా 57.10 సెకన్లతో, అలీ 1:05.32 సెకన్లతో ఎనిమిదో ప్లేస్‌‌లో నిలిచారు. లాన్‌‌ బౌల్స్‌‌లో ఇండియా వరుసగా రెండో విజయం సాధించింది. 

విమెన్స్‌‌ కేటగిరీలో రూపా రాణి–పింకి సింగ్‌‌ ద్వయం 2–0 (6–4, 7–5)తో తబెలో మువాంగో–జాకీ జాన్సే వాన్‌‌ రెన్స్‌‌బర్గ్‌‌ (సౌతాఫ్రికా)పై గెలిచారు. ఫలి తంగా గ్రూప్‌‌–బిలో టాప్‌‌లో నిలిచారు. పారా వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌లో అశోక్‌‌ మాలిక్‌‌ 143.8 పాయింట్లతో నాలుగో స్థానంతో, పరమ్‌‌జీత్‌‌ కుమార్‌‌ 135.6 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 

మార్క్‌‌ స్వాన్‌‌ (ఇంగ్లండ్‌‌, 153.9), రోలాండ్‌‌ ఎజురుకే (నైజీరియా,153.9), బోనీ బన్యావ్‌‌ గుస్టిన్‌‌ (మలేసియా, 153.5) వరుసగా గోల్డ్‌‌, సిల్వర్‌‌, బ్రాంజ్‌‌ గెలిచారు. మరోవైపు జూడో ప్లేయర్‌‌ తులికా మాన్‌‌ (-78 కేజీ)ను ఇండియా టీమ్‌‌ నుంచి తప్పించారు. గత ఏడాది కాలంలో మూడుసార్లు వేర్‌‌ అబౌట్స్‌‌ వివరాలు సమర్పించడంలో విఫలం కావడంతో నాడా అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ బ్యాన్‌‌ వల్ల తులికాపై రెండేళ్ల నిషేధం పడే చాన్స్‌‌ ఉంది.