ఇండియా ఫుల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌.. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అపజయం లేకుండా దూసుకుపోతున్న టీమిండియా

ఇండియా ఫుల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌..  టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అపజయం లేకుండా దూసుకుపోతున్న టీమిండియా

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అపజయం లేకుండా దూసుకుపోతున్న టీమిండియా.. కీలకమైన సూపర్‌‌‌‌‌‌‌‌–8 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ ముమ్మరం చేసింది. శుక్రవారం అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఫుల్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంది. తేలికపాటి వ్యాయామాలతో మొదలైన సెషన్‌‌‌‌‌‌‌‌ తీవ్రమైన నెట్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌తో ముగిసింది. బుమ్రా, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, హార్దిక్‌‌‌‌‌‌‌‌, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను సరి చూసుకున్నారు.

తర్వాత బ్యాటర్లు బ్యాట్లకు పదును పెట్టుకున్నారు. వరుసగా మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో డకౌటైన అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మను సౌతాఫ్రికాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు తప్పిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చీఫ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌ అతనితో ప్రత్యేకంగా మాట్లాడాడు. తర్వాత ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిపోయాడు. అయితే అభిని తప్పించే అవకాశమే లేదని బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ మోర్నీ మోర్కెల్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశాడు.