ఢాకా: బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మహమ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే వైదొలిగారు. ఈమేరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో తన రాజీనామాను వెల్లడించారు. అనారోగ్య కారణాల వల్లే పదవి నుంచి దిగిపోతున్నట్లు చెప్పారు. షహాబుద్దీన్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సన్నిహితుడిగా పేరుంది. సుదీర్ఘ కాలం పాటు హసీనా వెన్నంటి ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. కాగా, బ్యాంకాక్ పర్యటనలో ఉన్న స్పీకర్ అహ్మద్ తన టూర్ ను కుదించుకుని బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చి ప్రెసిడెంట్ రాజీనామాను ఆమోదించారు.
