జ్యోతిష్యం ప్రకారం.. నక్షత్రాలు.. గ్రహాలు.. వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయి. గ్రహాల దృష్టి వక్రమార్గంలో కొన్ని దోషాలు ఏర్పడుతాయి. ఏ గ్రహం దృష్టి సరిగా లేకపోయినా ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. వివాహంలో సమస్యలు.. పెళ్లి అయిన తరువాత దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం.. పిల్లల విషయంలో సమస్యలు తరచుగా వస్తుంటే జాతకంలో కుజ దోషం ఉందని పండితతులు చెబుతున్నారు. దీనినే మంగళదోషం అనికూడా అంటారు. మరి ఈ కుజ దోషానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .!
జ్యోతిష్యం ప్రకారం జాతకంలో కుజుడు 1, 4, 7, 8, 12వ ఇళ్లలో ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. దీని కారణంగా దంపతుల మధ్య గొడవలు.. అపోహలు.. లేదా వివాహం కాకపోవడం.. వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఇబ్బంది పడేవారిని ఉన్నవారికి మంగళదోషం ఉన్న వ్యక్తులుగా జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు.
ఇలాంటి వ్యక్తులకు శత్రువులు పెరుగుతారు. చిన్న వాదనలు ఒక్కోసారి హింసకు దారితీస్తాయి. వివాహ సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉండదు. కుటుంబంలో మిగతా వారిపై ఆధిక్యం చెలాయించాలని చూస్తారు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. మనశ్శాంతి ఉండదు. తల్లిదండ్రుల ఆస్తిని వారసులుగా కాపాడలేరు. బద్ధకస్తులు అవుతారు. ఉన్న స్థితిని కూడా కోల్పోతుంటారు.
కుజదోషం ఉన్న మహిళలు... వాస్తవంగా ఉంటారు. తమను తాము గాయపరచుకుంటారు. కఠువుగా ప్రవర్తిస్తారు. ఆటపట్టిస్తున్నట్లు చేస్తూ... హాని చేసుకుంటారు. అదే కుజదోషం ఉన్న మగవాళ్లైతే... దూకుడుగా ఉంటారు. అనుమానాస్పదంగా ప్రవర్తిస్తారు. వారు తమ భార్యను ఇంటికే పరిమితం చెయ్యాలనుకుంటారు. . కుజగ్రహం... శక్తి, గౌరవం, స్వాభిమానం, అహంకారం వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
చేయాల్సిన పరిహారాలు
ఇద్దరు కుజదోషం ( మంగళదోషం) ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు.
కుజదోషం ఉన్నవారు ముందుగా మర్రిచెట్టు లేదా అరటి చెట్టును పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత అసలైన పెళ్లి చేసుకోవాలి. అదే అమ్మాయిలైతే... ముందుగా వెండి లేదా బంగారంతో తయారైన శ్రీకృష్ణుడి ప్రతిమను పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత అసలైన వివాహం చేసుకోవాలి.
కుజుడికి ప్రధాన దేవుడు హనుమంతుడు. ఆంజనేయస్వామి ఆలయానికి ప్రతి మంగళవారం.. శనివారం వెళ్లాలి. రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమంతుని లాకెట్‌ను మెడలో ధరించాలి. మంగళవారం ఓ అంగారకాయనమ: అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
ఎర్రటి పప్పులు, గోధుమలు దానం ఇవ్వాలి. పగడం ఉంగరాన్ని ధరించాలి. ఇలా చేయడం వలన కుజదోషం ఉన్న వారి ఇబ్బందులకు ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
