దేవ్ జీ, రాజిరెడ్డి లొంగిపోతారు..మల్లోజుల కీలక వ్యాఖ్యలు

దేవ్ జీ, రాజిరెడ్డి లొంగిపోతారు..మల్లోజుల కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: దేవ్ జీ, రాజిరెడ్డి సహా మరికొందరు కూడా క్రమంగా జనజీవనంలోకి వస్తారని సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తెలిపారు. లొంగిపోయే ముందు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వానికి పలు డిమాండ్లు పెట్టామని, వాటి అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సోనూ దాదాగా తాను అడవి ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టినట్లు వెల్లడించారు. 

ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తాము సాధించిన విజయాలు ఏంటో తెలుసుకోవాలంటే ప్రజల మధ్యకు వెళ్లాలని అన్నారు. ఆదివాసీలను అడిగితే తాము చేసిన పనుల గురించి వారు స్వయంగా చెబుతారని పేర్కొన్నారు.1980లో ఉన్న తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు చాలా తేడా ఉందని మల్లోజుల వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. నాటి పరిస్థితుల్లో సాగిన ఉద్యమాన్ని ఇప్పుడు తిరిగి తీసుకురాలేకపోయామని చెప్పారు ఆదివాసీ ప్రాంతాల్లో జరిగిన మార్పులు, తము ఉద్యమ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోందని అన్నారు.

►ALSO READ | హైదరాబాద్ సిటీ పోలీసుల కీలక నిర్ణయం.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం