- నేటి నుంచి 22వ తేదీ వరకు వెసులుబాటు
హైదరాబాద్, -వెలుగు: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మూడో విడత గడువును ఈ నెల 22 వరకూ పొడగించినట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఇటీవల ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ కావడంతో..వాటిలో పాసైన విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా నిర్ణయంతో మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు ఈ నెల 22 వరకు పెరిగింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 15 నుంచి 21 వరకు కొనసాగుతుంది. దీనికోసం విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాలి. వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 16 నుంచి 22 వరకు వెసులుబాటు కల్పించారు.
