హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నాడని సీఎం రేవంత్ ఆరోపించగా.. తాను ఆపితే ఏ ప్రాజెక్ట్ ఆగదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో మెట్రో ఫేజ్ 2 నిధుల అంశంపై కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2కు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు సీఎం రేవంత్. ఐఆర్ఎఫ్సీ నుంచి జూన్ 15వ తేదీనే విడుదల కావాల్సిన రుణం ఇంకా విడుదల కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం రేవంత్.. ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించాలని కిషన్ రెడ్డిని కోరారు సీఎం రేవంత్.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణకు ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం త్వరగా వచ్చేలా చూడాలని కిషన్ రెడ్డిని కోరారు సీఎం రేవంత్. సమస్య పరిష్కరానికి ఏ మీటింగ్‌కైనా.. తాను ఎప్పుడైనా సిద్ధమేనని తెలిపారు సీఎం రేవంత్. వీలైనంత త్వరగా రైల్వే శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేయించాలని.. అన్ని పత్రాలతో హాజరై స్పష్టత ఇస్తానని చెప్పారు సీఎం రేవంత్. రైల్వే మంత్రితో భేటీకి సంబంధించి కిషన్ రెడ్డి కాల్ కోసం వెయిట్ చేస్తానని అన్నారు సీఎం రేవంత్.
