ఆగస్టు నెల జ్యోతిష్యం : మకరరాశి వారికి కెరీర్ లో కొత్త అవకాశాలు

ఆగస్టు నెల జ్యోతిష్యం : మకరరాశి వారికి కెరీర్ లో కొత్త అవకాశాలు

ఆగష్టు నెల మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. వాహన యోగం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు.కెరీర్​ లో కొత్త అవకాశాలు వస్తాయి.ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. 

మకరరాశి వారికి 2026 ఆగస్టు నెలలో తృతీయంలో రాశ్యధిపతి శనీశ్వరుడు, సప్తమ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ప్రతి  విషయం లోకూడా  మీ మాట నెగ్గుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. 

ఉద్యోగ జీవితంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీ మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులతో వాదోపవాదా లకు దిగవద్దు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 

కొత్త ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.  వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో ఆర్థిక స్థిరత్వం కూడా మెరుగుపడుతుంది. పెట్టుబడుల విషయంలో కూడా కొన్ని మంచి అవకాశాలు కనిపించవచ్చు. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. 

ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి.  నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. 

పరిహారాలు:  రోజూ సాయంత్రం తులసి మొక్క దగ్గన ఆవు నెయ్యితో దీపారాధన.. నిత్యం గోమాతకు గోధుమలు ఆహారంగా ఇవ్వాలి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.