ఈ ఏడాది అధిక మాసం రావడంతో జ్యేష్ఠమాసం మొత్తం 60 రోజులు ఉంటుంది. జూన్ 15 న అమావాస్యతో అధిక జ్యేష్ఠమాసం ముగిసింది. జూన్ 16 మంగళవారం నుంచి నిజ జ్యేష్ఠమాసం ప్రారంభమైంది. పండితులు తెలిపిన వివరాల నిజ మాసంలో చాలా పవిత్రమైనది.. ఈ నెలకు జ్యేష్ఠమాసం అని ఎందుకు పేరు వచ్చింది.. ఈ నెలలో ఏం చేయాలి.. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెల మూడవ నెల. జ్యేష్ఠమాసంలో కొన్ని పరిహారాలు పాటించడం వలన జాతక దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఈనెలను పుణ్యమాసం అని కూడా అంటారని పండితులు చెబుతున్నారు. దానధర్మాలు.. ఉపవాస దీక్షలు పాటించడం వలన మన ఖాతాలో పుణ్య ఫలం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠ అనగా సంస్కృతంలో పెద్ద.. పొడవు అని అర్దం.. అంటే జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. మిగతా నెలల కంటే జ్యేష్ఠ మాసంలో పగలు ఎక్కువుగాను.. రాత్రి తక్కువుగాను ఉంటుంది. ఆలస్యంగా సూర్యాస్తమయం కావడం.. తొందరగా సూర్యోదయం కావడం వంటి పరిణామాలు ఉంటాయి.
పురాణాల ప్రకారం జ్యేష్ఠ మాసానికి అధిపతి కుజుడు. ఈ నెలలో చేసే పుణ్య స్నానాలకు.. దాన ధర్మాల వలన ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వీటితో పాటు కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు.
దానం చేయాల్సినవి
- నీటితో నిండిన రాగిపాత్ర
- నల్ల నువ్వులను శని వారం రోజు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది.
- నువ్వులు.. బెల్లం కలిపిన ఉండలను పేదలకు ఆహారంగా ఇవ్వాలి.
- బ్రాహ్మణులకు వస్త్రదానం
- పేదలకు అన్నదానం
జ్యేష్ఠ పూర్ణిమ రోజు చేయాల్సిన దానాలు.. ఫలితం
- జ్యేష్ఠ పూర్ణిమను మహా జ్యేష్ఠి అంటారు. ఆ రోజున నువ్వులను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది.
- గొడుగు, చెప్పులను దానం చేస్తే జాతకంలో శనిదోషం నుంచి ఉపశమనం కలుగుతుంది.
- అన్నదానం.. వస్త్రదానం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
- కలశం, జలం, గంధం వంటివి దానం చేస్తే కూడా మంచిది.
- జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహరా అని అంటారు. దుర్దశలను పోగొట్టే శక్తి దీనికి ఉంది. ఆ రోజున నదీ స్నానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
- జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణువును ఆరాధించి ఉపవాసం ఉంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.
జ్యేష్ఠమాసంలో పాటించాల్సిన నియమాలు
- సూర్యోదయానికి ముందు స్నానం చేసి సూర్యుని పూజించి అర్ఘ్యం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
- జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైన నెల. గోధుమపిండితో బ్రహ్మదేవుని ప్రతిమ చేసి పూజించాలి
- .విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అనంత ఫలితాన్ని పొందుతారు.
- ఈ నెలలో పగటి పూట నిద్రపోకూడదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే కాసేపు నిద్రపోవచ్చు.
- జ్యేష్ఠ మాసంలో మొక్కలు, జంతువులు, పక్షులకు సేవ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
- జంతువులు తాగేందుకు నీటిని ఒక పాత్రలో పోసి ఉంచాలి.
- జ్యేష్ఠ మాసానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ నెలలో హనుమంతుని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
- ఈ నెలలో కారం ఎక్కువుగా ఉండే ఆహార పదార్ధాలను, వెల్లుల్లి వంటి వాటిని తినకూడదు.
- సిగరెట్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
- ఈనెలలో వంకాయ తినకూడదు. ఇది పిల్లలకు హాని చేస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
