ఎగ్జామ్స్ కు ముందే పేపర్ లీక్..వాట్సాప్ గ్రూప్ లో 12 వ తరగతి కెమిస్ట్రీ పేపర్, ఆన్సర్లు

ఎగ్జామ్స్ కు ముందే పేపర్ లీక్..వాట్సాప్ గ్రూప్ లో  12 వ తరగతి కెమిస్ట్రీ పేపర్, ఆన్సర్లు

ఆన్ లైన్ లో అమ్మకానికి బోర్డు ఎగ్జామ్ పేపర్లు.. పైసలుంటే చాలు ఎగ్జామ్ కు ముందే క్షణాల్లో ఎగ్జామ్ పేపర్లు మీ వాట్సాప్ లో ఉంటాయి.అంతేకాదు ప్రశ్నాపత్రంతో పాటు ఆన్సర్లు కూడా వారే రాసిస్తారు. మహారాష్ట్రలో బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణ లోపాలు మరోసారి బయటపడ్డాయి. మహారాష్ట్ర బోర్డు నిర్వహించే 12వ తరగతి ఎగ్జామ్ కెమిస్ర్టీ పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. 

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ ఘటన బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణతీరుపై ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (MSBSHSE) హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (HSC) 12 తరగతి కెమిస్ట్రీ పేపర్ సోషల్ మీడియాలో కనిపించాయి. నాగ్‌పూర్‌లో 12వ తరగతి కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రసారం అయినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శనివారం (ఫిబ్రవరి 20) దర్యాప్తు చేపట్టారు. 

ఓ నాగ్ పూర్ లోని ఓ ఉన్నత పాఠశాలలో  పరీక్ష రాస్తున్న విద్యార్థి పదే పదే వాష్ రూంకు వెళ్తుండగా  గమనించిన ఇన్వెజిలెటర్లు అనుమానంతో చెక్ చేయగా మాల్ ప్రాక్టీస్ వెలుగులోకి వచ్చింది. వాష్ రూంలో సెల్ ఫోన్ ఉంచిన విద్యార్థి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు . పరీక్షకు ముందు ప్రశ్నాపత్రాన్ని  వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసినట్లు గుర్తించారు. అదే గ్రూప్ లో ప్రశ్నాపత్రంతోపాటు సమాధానాలు కూడా  పంపించడం  కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కోచింగ్ తో సంబంధం ఉన్న  ఓ వ్యక్తి  డబ్బు కోసం ప్రశ్నాపత్రాన్ని పంచుకున్నట్లు  అధికారులు గుర్తించారు. 

మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో అక్రమాలు ఇదే మొదటి సారి కాదు. ఫిబ్రవరి 12న  మహారాష్ట్రలోని శంభాజీ నగర్ లో 12 వ తరగతి పరీక్షల్లో విద్యార్థులంతా కాపీ కొట్టారు.  ఇదంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటన పరీక్షల నిర్వహణపై ఆందోళనలు రేకెత్తించింది. టీచర్ల సమక్షంలోన విద్యార్థులు పేపర్లు చూసి రాసుకుంటూ బహిరంగంగా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. 
అయితే పరీక్షల్లో  పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన వారిపై మహారాష్ట్ర మాల్  ప్రాక్టీసెస్ నిరోధక చట్టం 1982 కింద కేసులు నమోదు చేస్తామని బోర్డు ప్రకటించింది.