VijayRashmika: పెళ్లికి ముందే రొమాంటిక్ యాడ్ షూట్.. విజయ్, రష్మికల వెడ్డింగ్ ప్లాన్ ఇదే!

VijayRashmika: పెళ్లికి ముందే రొమాంటిక్ యాడ్ షూట్.. విజయ్, రష్మికల వెడ్డింగ్ ప్లాన్ ఇదే!

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి.  మరో నాలుగు రోజుల్లో వివాహం చేసుకోబోతున్నారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ వేదిక కానుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ వీరి పెళ్లి ఏర్పాటు ఘనంగా జరుగుతున్నారు. అయితే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న వేళ ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఉదయపూర్ వేదికగా ఏడడుగులు..

రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయపూర్‌లోని 'ది మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్' వేదికగా విజయ్, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరగనుంది.  వీరి పెళ్లి చాలా ప్రైవేట్‌గా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించాలని ఈ జంట నిర్ణయించుకుంది. సినీ పరిశ్రమకు చెందిన ఎవరినీ ఈ వేడుకకు ఆహ్వానించడం లేదని సమాచారం.

పెళ్లికి ముందే రొమాంటిక్ యాడ్ షూట్

అయితే వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు ఈ జంట తమ వృత్తిపరమైన బాధ్యతలను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.  ఒక ప్రముఖ బ్రాండ్ కోసం విజయ్, రష్మిక కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో  నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో వీరు ఒక బాత్ సోప్ యాడ్ కోసం కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ ప్రకటనలో వీరు నవ దంపతులుగా కనిపించి అందరినీ మెప్పించారు. ఇప్పుడు చేయబోయే కొత్త యాడ్‌లో వీరి కెమిస్ట్రీ మరింత పీక్స్‌లో ఉంటుందని, షూటింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్స్‌ను వాడుతున్నారని టాక్. ఈ యాడ్ షూటింగ్ పూర్తయిన వెంటనే వారు పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు.

►ALSO READ | Prabhas: ప్రభాస్ షాకింగ్ ఫుడ్ ట్రీట్!.. చెన్నై టు ముంబైకి విమానంలో బిర్యానీ!

ఫోన్లకు నో ఎంట్రీ.. కమర్షియల్‌కు నో!

తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ఈ జంట 'నో ఫోన్ పాలసీ'ని పాటిస్తోంది.  మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ వీరి వెడ్డింగ్ ఫిల్మ్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే, విజయ్ దేవరకొండ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. తన జీవితంలోని అత్యంత వ్యక్తిగతమైన వేడుకను వ్యాపారమయం చేయడం విజయ్‌కు ఇష్టం లేదని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్!

ఉదయ్‌పూర్‌లో పెళ్లి ముగిశాక, మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో రష్మిక, విజయ్ పెళ్లి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి, రీల్ లైఫ్‌లో అద్భుతమైన కెమిస్ట్రీని పండించిన ఈ జంట.. ఇప్పుడు నిజ జీవితంలోనూ జంటగా మారబోతుండటం చూస్తుంటే అభిమానుల ఆనందానికి అవధులు లేవు.