అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రపంచ దేశాలపై టారిఫ్ లను 15 శాతానికి పెంచారు. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లు చట్ట విరుద్దమని కోర్టు తీర్పునిచ్చినా తర్వాత 10 శాతం టారిఫ్ లను పెంచారు ట్రంప్. తాజాగా మరో 5శాతం పెంచారు.
ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు చట్టవిరుద్దమని సుప్రీకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ట్రంప్ కు వ్యతిరేకంగా ఆరుగురు జడ్జీలు, అనుకూలంగా ముగ్గురు జడ్జీలు తీర్పునిచ్చారు. అమెరికా కాంగ్రెస్ స్పష్టమైన ఆమోదం లేకుండానే ట్రంప్.. ప్రపంచ దేశాలపై విచ్చలవిడిగా టారిఫ్ లు పెంచారని, ట్రంప నత అధికార పరిధిని దాటారిని కోర్టు తీర్పునిచ్చింది. అత్యవసర నిబంధనల కింద చట్టం అధ్యక్షుడికి అపరిమిత టారిఫ్ అధికారాలు ఇవ్వదని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తీర్పును వెల్లడించారు.
►ALSO READ | అన్నింటిని గమనిస్తున్నం: అమెరికా సుప్రీం కోర్టు తీర్పుపై ఇండియా ఫస్ట్ రియాక్షన్
తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ తీవ్ర నిరాశతో ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. తీర్పు విదేశీ ప్రయోజనాలకోసం ప్రభావితమైందని ఆరోపించారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరోసారి టారిఫ్ లు పెంచారు. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122ని ఉపయోగించి దిగుమతులపై కొత్తగా 10 శాతం ప్రపంచ సుంకాన్ని విధించారు. టారిఫ్ ను శనివారం 15 శాతానికి సవరించారు.
