న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర వాణిజ్య సుంకాలను అమెరికా సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా సుప్రీం కోర్టు తీర్పుపై తొలిసారిగా ఇండియా స్పందించింది. పరిణామాలన్నింటిని నిశీతంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం (ఫిబ్రవరి 21) ఒక ప్రకటన విడుదల చేసింది.
“ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన పరస్పర వాణిజ్య సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పును గమనించాం. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆ విషయంపై మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం అమెరికా ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించింది. ఈ పరిణామాలన్నింటినీ మేము అధ్యయనం చేస్తున్నాము” అని ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ సుంకాలను రద్దు చేసింది. అమెరికా రాజ్యాంగ ప్రకారం.. ఇతర దేశాలపై సుంకాలు విధించాలంటే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం అవసరం.
కానీ ట్రంప్ ఇలా చేయలేదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం) 1977ను ఉపయోగించి వాణిజ్య సుంకాలు విధించింది ట్రంప్ ప్రభుత్వం. వాస్తవానికి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి వాణిజ్యాన్ని నియంత్రించే అధికారాన్ని ఇస్తుంది.
►ALSO READ | ఇరాన్ లో ఖమేనీ పాలన అస్సలు ఉండొద్దు.. ట్రంప్ కండీషన్ ఇదేనా.. డెడ్ లైన్ ఎప్పటి వరకు..?
కానీ ట్రంప్ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విధించాడు. సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావించింది. నేషనల్ ఎమర్జెన్సీ కోసం ఉద్దేశించిన చట్టాన్ని ఉపయోగించుకుని విస్తృత సుంకాలను విధించడం ద్వారా ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని అమెరికా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఈ చట్టం అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాలు ఇవ్వదని అమెరికా అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూల్ చేసిన సుంకాలను ట్రంప్ ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
భారత్-అమెరికా టారిఫ్స్ నో చేంజ్: ట్రంప్
భారత్-అమెరికా మధ్య కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పులు లేపని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పరస్పర టారిఫ్‌ను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, భారత్తో ఉన్న ఒప్పందంపై ప్రభావం ఉండదని తెలిపారు.
భారత్ టారిఫ్లు చెల్లిస్తుందని, అమెరికా మాత్రం చెల్లించదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ విధించిన ప్రపంచవ్యాప్త టారిఫ్లకు చట్టబద్ధత లేదని అమెరికా సుప్రీంకోర్టు 6: 3 మెజారిటీతో తీర్పు వెలువరిం చింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఈతీర్పును రచించారు.
దిగుమతులను నియంత్రించే అధికారం టారిఫ్లు విధించే అధికారాన్ని సూచించదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ మరో చట్టం కింద 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను ప్రకటించారు. ఇదిలా ఉండగా, భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం మార్చిలో కుదిరి, ఏప్రిల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
