ఇరాన్ లో ఖమేనీ పాలన అస్సలు ఉండొద్దు.. ట్రంప్ కండీషన్ ఇదేనా.. డెడ్ లైన్ ఎప్పటి వరకు..?

ఇరాన్ లో ఖమేనీ పాలన అస్సలు ఉండొద్దు.. ట్రంప్ కండీషన్ ఇదేనా.. డెడ్ లైన్ ఎప్పటి వరకు..?

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో  ఏ క్షణాన్నైనా అమెరికా సైనిక దాడికి దిగుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది.. అందుకు తగ్గట్టుగానే అమెరికా భారీ సైనిక బలగాలను ఇరాన్ సరిహద్దుల్లో మోహరించడం.. యుద్దానికి వెనక్కి తగ్గేది లేదంటూ ఇరాన్  ప్రకటన చేసింది. మరోవైపు రెండు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నారు. ఇరాన్ అమెరికాకు సానుకూలంగా స్పందిస్తే మంచిది లేదంటే దాడి తప్పదని  ట్రంప్  డెడ్ లైన్ పెట్టారు. అయితే చర్చల్లో ట్రంప్ డిమాండ్లు ఏకపక్షంగా ఉన్నాయని ఇరాన్ చెపుతోంది. ట్రంప్ కండిషన్స్ ఏంటీ.. ఎప్పటివరకు డెడ్ లైన్ ఎప్పటివరకు ?

అణు చర్చలు విఫలమైతే ఇరాన్ పై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం హెచ్చరించారు.  రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నందున సైనిక చర్య సాధ్యమేనా  అని విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ అవుననే సమాధానమిచ్చారు. అణు చర్చల తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఓ ఒప్పందం కుదురుతుందని ఇరాన్ దౌత్యవేత్త చెప్పిన గంటల్లోనే  ఇది జరగడం యుద్దం తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

ఈ వారం జెనీవాలో జరిగిన చర్చల తర్వాత ట్రంప్ కూడా ఇరాన్ కు  డెడ్ లైన్ విధించారు. ఇరాన్  తమ డిమాండ్లను తప్పకుండా ఒప్పుకుంటుంది.. అదీ పది పదిహేను రోజుల్లో జరుగుతున్నదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో  అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి..వారంపదిరోజుల్లో చర్చలు ఓ కొలిక్కి వస్తాయని రెండు దేశాలకు ప్రయోజనం కలిగించేలా చర్చలు ముగుస్తాయని భావిస్తున్నాం.. యుద్దమైనా, శాంతికైనా రెండింటికి తాము సిద్దంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగమంత్రి అరగ్చీ ప్రకటించడం చూస్తే రెండు దేశాలు యుద్దానికి సిద్దంగా ఉన్నట్లే కనిపిస్తోంది.  

ట్రంప్ కండిషన్స్ ఇవేనా.. 

సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ, అతని కుమారుడు మోజ్తాబా ఖమేనీ లక్ష్యంగా  పరిమితమైన దాడులు  చేసేందుకు అమెరికా సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ లో ఖమేనీ పాలన, ఇరాన్ సంక్షోభం కారణంగా దీర్థకాల ప్రత్యర్థులు అయిన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దశాబ్దాల తర్వాత మిడిల్ ఈస్ట్ లో యూఎస్ అతిపెద్ద సైనిక బలాగాలను మోహరించింది. యుద్దనౌకలు, యుద్ద విమానాలు ఇరాన్ సరిహద్దుల్లోకి తరలించింది. అణు చర్చలు విఫలమైతే యుద్దానికి సిద్దంగా ఉన్నామని రెండు దేశాలు సంకేతాలిచ్చాయి. ఈ క్రమంలో అయతుల్లా ఖమేనీ, అతని కుమారుడు మోజ్తాబా, ముల్లాలు లక్ష్యంగా ప్రధాన డిమాండ్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు  తెలుస్తోంది. ఈ లెక్కన అమెరికా దాడులు చేస్తే ముందు నుంచి చెప్పినట్లుగానే ఖమేనీ, ఇరాన్ నేతలు ప్రధాన లక్ష్యంగా దాడులు జరిగే ఛాన్స్ ఉంది. 

►ALSO READ | ట్రంప్ ముందుకు ఇరాన్ ఖమేనీని ఖతం చేసే ప్లాన్.. అమెరికా వార్ స్ట్రాటజీ లీక్..

వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను  అధికారం నుంచి తొలగించనట్లుగానే ఇరాన్ లో ఖమేనీ పాలనను కూడా అంతచేయాలని ట్రంప్ ప్రయత్నించడం అది కష్టమని తెలిసి వెనక్కి తగ్గినట్టు అమెరికా విదేశాంగం కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతోంది. అయితే మార్కో రూబియో ప్రకటన కొన్ని వారాల తర్వాత ఇరాన్ లో ఖమేనీ పాలనకు ముగింపు పలకాలని ట్రంప్ వ్యాఖ్యలు చేయడం, మిడిల్ ఈస్ట్ లో భారీ బలగాల మోహరింపుతో ఏ క్షణాన్నైనా సైనిక చర్య జరగొచ్చన్న వాదనలుబలంగా వినిపిస్తున్నాయి.