IND-W vs AUS-W 3rd T20: అడిలైడ్ లోని ఓవల్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20లో భారత్– ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో.. ఈ నిర్ణయాత్మకమైన మ్యాచ్ లో.. టాస్ గెలిచి టీమిండియా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. తుది జట్టులో క్రాంతి గౌడ్‌ను పక్కనపెట్టి ఆమె స్థానంలో శ్రేయాంక పాటిల్ తీసుకుని ఒక మార్పుతో బరిలోకి మహిళల జట్టు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత అమ్మాయిల టీం 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో స్మృతి మంధాన (55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా, జెమిమా రోడ్రిగ్స్ (59) కూడా అర్థ శతకంలో ఉమెన్ ఇన్ బ్లూ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
జట్టు స్కోర్ బోర్డును రిచా ఘోష్ (18) కాసేపు పరుగులు పట్టించినప్పటికీ ఆమె సోఫీ మోలినెక్స్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి.. జార్జియా వోల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. అనంతరం క్రీజులోకి వచ్చిన భారత బ్యాటర్లు షఫాలీ వర్మ (7), హర్మన్‌ప్రీత్ కౌర్ (2), అమంజోత్ కౌర్ (1), దీప్తి శర్మ (1) పెద్దగా రాణించకపోగా.. చివర్లో అమంజోత్ కౌర్, దీప్తి శర్మలు రనౌట్ కావడంతో టీమిండియా భారీ పరుగులు చేయకుండా ఆస్ట్రేలియా టీం అడ్డుకున్నట్లు అయింది.
►ALSO READ | T20 World Cup: వరల్డ్ కప్లో భారత్ vs దక్షిణాఫ్రికా హెడ్ టు హెడ్ రికార్డులు
టీమిండియా జట్టును కట్టడి చేయడంలో అన్నాబెల్ సదర్లాండ్ రెండు వికెట్ల తీసుకోగా, ఆసీస్ కెప్టెన్ సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్ తలో వికెట్ పడగొట్టారు. అన్నాబెల్ సదర్లాండ్ వేసిన చివరి ఓవర్లో దీప్తి శర్మ రెండో పరుగు కోసం వెళ్తుండగా (ఎల్లిస్ పెర్రీ/బెత్ మూనీ) రనౌట్ అయింది. 19.5 ఓవర్ చివరి బంతికి ఆలస్యంగా పరుగుకు వెళ్లడంతో బెత్ మూనీ చేతిలో అమన్‌జోత్ కౌర్ అవుట్ అయింది.
