రెండేళ్ళలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని..... ఏ నర్సంపేట మెడికల్ కాలేజీ కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణప్రదంగా తాపత్రపడ్డారో, ఆ కాలేజీకి ఆయన పేరును పెట్టి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం నర్సంపేట చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు కేటీఆర్. వరంగల్‌లో జరిగిన పెద్ది సుదర్శన రెడ్డి సంతాప సభలో మాట్లాడిన కేటీఆర్. . పెద్ది సుదర్శన్ రెడ్డి కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు... గొప్ప అభ్యుదయవాది అని అన్నారు.
రాజకీయాలకతీతంగా నర్సంపేట ప్రజల కోసం పరితపించిన ఆ గొప్ప నేతను తలచుకుంటూ.. పెద్ది కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బిఆర్ఎస్ పార్టీది. భవిష్యత్తులోనూ ఆ కుటుంబం వెంటే మా పార్టీ ఉంటుంది అని కేటీఆర్ భరోసానిచ్చారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన పెద్ది సుదర్శన రెడ్డి ఆశయాలు... నర్సంపేట గడ్డపై ఎప్పటికీ సజీవంగా ఉంటాయన్నారు కేటీఆర్.
ALSO READ : నెగ్గిన ప్రతిపక్షాల పంతం: విద్యార్థులపై లాఠీచార్జ్‌పై సభలో అమిత్ షా ప్రకటన
ప్రతి ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చాలా కీలకం... ఆయన ఎంతో సాధారణ జీవితం గడిపిన గొప్ప నాయకుడని హరీశ్ రావు అన్నారు. పెద్ధితో కలిసి తాను పాల్గొన్న పురాతన దేవాలయ కార్యక్రమమే చివరిది అవుతుందని తాను అసలు ఊహించలేదని హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం ఆయనను ఎన్నో విధాలుగా భయపెట్టినా, ప్రలోభపెట్టినా ఏనాడూ తలొగ్గని ధీశాలి పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. ఆయనను బ్రతికించడం కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కష్టకాలంలోనూ, భవిష్యత్తులోనూ పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
