IND vs SA: 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన బాధాకర ఓటమిని దక్షిణాఫ్రికా జట్టు పూర్తిగా పక్కన పెట్టిందని ప్రోటీస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ స్పష్టం చేశాడు. భారత్‌తో జరగనున్న సూపర్–8 మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో అతడు మాట్లాడుతూ.. ఆ ఓటమిని మళ్లీ తవ్వుకోవడం కన్నా మరిచిపోవడమే ఉత్తమమైన మార్గమని వెల్లడించాడు. నిజంగా చెప్పాలంటే, ఆ మ్యాచ్ తర్వాత మేమంతా దాన్ని మరిచిపోయాం.. ఎవరికీ దాని గురించి మాట్లాడాలని అనిపించలేదని డికాక్ చెప్పాడు.
గుండెల్లో మిగిలిన ఓటమి బాధ:
2024 ఫైనల్ ఎందుకు అంతగా బాధను మిగిల్చిందో అర్థం చేసుకోవడం కష్టం కాదు.. బార్బడోస్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి టీ20 వరల్డ్ కప్ కప్పు అంచు వరకూ చేరింది అని క్వింటన్ డికాక్ తెలిపాడు. చివరి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితిలో, హైన్రిచ్ క్లాసెన్ విధ్వంసకరంగా ఆడుతూ అక్షర్ పటేల్ బౌలింగ్ లో 24 పరుగులు కొట్టాడు. కప్పు దక్షిణాఫ్రికా చేతుల్లోకి వెళ్లబోతుందనిపించిన క్షణంలో.. 17వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా క్లాసెన్‌ను అవుట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా తలకిందులైంది. 177 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి మూడు ఓవర్లలో తమ జట్టు తడబడటంతో.. స్వల్ప పరుగుల తేడాతో ఓడిపోయినట్లు వెల్లడించాడు.
►ALSO READ | PAK vs NZ Match Delay: పాకిస్తాన్ – న్యూజిలాండ్ మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకి
కొత్త అధ్యాయం– సరికొత్త పోటీ:
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ తర్వాత పొట్ట కప్ టోర్నీలో భారత్‌తో ఇది తొలి తలపడుతున్నాం.. ఈ సూపర్–8 పోరుకు దక్షిణాఫ్రికా మరింత ఆత్మవిశ్వాసంతో వస్తోంది. బార్బడోస్ ఓటమి తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచిన ప్రోటీస్, తమపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఐడెన్ మార్క్రం ఆఫ్‌స్పిన్ కీలకంగా ఉండబోతుందని అంచనా. భారత్ టాప్ ఆర్డర్‌ను లక్ష్యంగా చేసుకున్న వ్యూహంతో ప్రోటీస్ బరిలోకి దిగనుంది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా సూపర్–8 మ్యాచ్ రేపు రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
