టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) మానవతా హృదయానికి నిజంగా సలాం కొట్టాల్సిందే. ప్రస్తుతం ఆమె వయస్సు కేవలం 24 ఏళ్లే అయినా, ఆమె చలించే మనసుకు వయస్సుతో సంబంధమే లేదు. తనవంతు సాయం అందుకున్న వారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే గుణం శ్రీలీల సొంతం. ఇన్నాళ్లు ప్రేక్షకుల అందరికీ శ్రీలీల సినిమాల గురించే విన్నారు.. ఇప్పుడు ఈ వార్త చూస్తే మీ మనుషుల లోతుల్లో నుంచి శ్రీలీలను అభిమానిస్తారు. వివరాల్లోకి వెళితే..
హీరోయిన్ శ్రీలీల 24 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన శ్రీలీల, లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో తొలిసారిగా దీనిపై స్పందించింది. తనకు దత్తత పిల్లలు ఉన్న విషయం గురించి మాట్లాడుతూ, వారు తనతో కలిసి నివసించడం లేదని, కానీ మంచి సంరక్షణలో ఉన్నారని చెప్పింది. ‘‘వాళ్లు నా దగ్గరే ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కానీ వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు మాటలు రావు, కొంచెం ఎమోషనల్ అవుతాను’’ అని శ్రీలీల తెలిపింది.
లేటెస్ట్గా ఓ చిన్నారి బాబుని శ్రీలీల ఎత్తుకుని ఆడిస్తున్న ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇందులో శ్రీలీల ఆ చిన్నారి బాబును ఆప్యాయంగా గుండెలకి హత్తుకుని ఆడిస్తుంది. తన మనసుతో ఆప్యాయంగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, ప్రాణంగా లాలిస్తూ, తన గొప్ప మనసుతో ముద్దాడి ప్రేమను పంచింది. ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు వీపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు. మీ మంచి మనసుకి వందనం.. మీలా అందరూ ఉంటే ఏ ఒక్కరూ ఒంటరి అవ్వరు" అని ట్వీట్స్ పెడుతున్నారు.
2025 ఏప్రిల్ లో కూడా, శ్రీలీల తన ఇంస్టాగ్రామ్లో ఓ చిన్నారితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. 'మా ఇంటికి మరో చిట్టితల్లి' వచ్చిందంటూ శ్రీలీల పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా షేర్ చేసిన ఫొటోల్లో పాప బుగ్గపై శ్రీలీల ముద్దు పెడుతూ కనిపిస్తూ ఆకర్షిస్తోంది. ఇలా మానవత్వాన్ని చాటుకున్న శ్రీలలపై, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సెలబ్రేటిస్ అందరూ ఇలానే మానవత్వాన్ని చాటుతుంటే, అనాథలు కనిపించరు కదా అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
పిల్లలను దత్తత తీసుకునే నిర్ణయం ఎలా వచ్చింది?
శ్రీలీల ఈ పిల్లలను ఎలా దత్తత తీసుకుందో కూడా ఈ ఇంటర్వ్యూలో వివరించింది. 2019లో తాను చేసిన కన్నడ సినిమా ‘కిస్’ షూటింగ్ సమయంలో తన దర్శకుడు ఆమెను ఓ ఆశ్రమానికి తీసుకెళ్లాడని, అక్కడి పిల్లలతో ఏర్పడిన అనుబంధమే ఈ నిర్ణయానికి కారణమని చెప్పింది. ‘‘ఇది చాలా కాలం రహస్యంగా ఉంచాను. పేరు, గుర్తింపు కోసం కాదు. ఇప్పుడు ఈ విషయం బయటకు రావాలని ఆ సంస్థ కోరింది. దీని వల్ల మరింత మంది ఈ దిశగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను’’ అని శ్రీలీల తెలిపింది.
ఎప్పుడు మొదలైంది అంటే..
శ్రీలీలకి పిల్లలంటే చాలా ఇష్టం. 2022లో ఒక అనాథాశ్రమం నుండి 'గురు, శోభిత' అనే ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. ఆ మాదిరిగానే ఆడపిల్లలపై తన ప్రేమను కొనసాగిస్తూ.. మరో పాపని కూడా దత్తతు తీసుకుంది. అందులో భాగంగానే 'తన ఇంటికి మరో చిట్టితల్లి' వచ్చిందంటూ గతంలో శ్రీలీల పోస్ట్ పెట్టింది. ఇకపోతే 2022లో వచ్చిన కన్నడం ఫిల్మ్ 'బై టూ లవ్' సినిమా విడుదలకు ముందే గురు, శోభిత అనే ఇద్దరి అమ్మాయిలను దత్తత తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు లేటెస్ట్గా మరో బిడ్డని తీసుకున్న వీడియో వైరల్గా మారింది. మాతృత్వం తనలో చాలా బలంగా ఉందని, చుట్టూ ఉన్నవారిని కూడా తల్లిలా చూసుకుంటానని చెప్పిన శ్రీలీల వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీలీల కమింగ్ మూవీస్:
హీరోయిన్‌గా పరిచయమైన అతి కొద్దికాలంలోనే పాపులర్ అయిన శ్రీలీల.. వరుస స్టార్ హీరోల సినిమాలతో సెన్సేషనల్ అయింది. బ్యాక్ టు బ్యాక్ తొమ్మిది సినిమాల్లో చాన్స్‌లు అందుకుంది. అయితే అవకాశాలు వచ్చినంత ఈజీగా విజయాలు రాలేదు. దీంతో కెరీర్‌లో కొంత నెమ్మదించిన శ్రీలీల.. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటోంది. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ సరసన నటిస్తోంది. ఈ మూవీ నుంచి త్వరలో అప్డేట్స్ రానున్నాయి.
ఇకపోతే, శ్రీలీల తమిళంలో నటించిన పరాశక్తి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో హీరో శివ కార్తికేయన్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అంతేకాదు.. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ జంటగా ఓ మూవీ రానుంది. దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తారు. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.
