Vishnu Vinyasam: శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ నుంచి ‘ కన్‌ఫ్యూజన్ సాంగ్ రిలీజ్.. మ్యూజికల్ అప్‌డేట్‌తో పెరిగిన అంచనాలు!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ నుంచి ‘ కన్‌ఫ్యూజన్ సాంగ్ రిలీజ్..   మ్యూజికల్ అప్‌డేట్‌తో పెరిగిన అంచనాలు!

వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయన కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న 'విష్ణు విన్యాసం' మూవీ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈ సాంగ్ అంచనాలను మరింత పెంచుతోంది. శ్రీ విష్ణు సరసన నయన సారిక నటిస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది.

రిలీజ్ ముందే లాభాలు..

ఈ'విష్ణు విన్యాసం'  రిలీజ్ కు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందనట్లు టాక్ వినిపిస్తోంది.సుమారు రూ. 19 కోట్ల వ్యయంతో ఈ మూవీని నిర్మించారు. హీరో శ్రీవిష్ణుకు ఉన్న క్రేజ్ కారణంగా, ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు కలిపి ఏకంగా రూ. 26 కోట్లకు అమ్ముడయ్యాయని సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. దీంతో  ఈ సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టక ముందే మేకర్స్ కు రూ. 7 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. ఇక విడుదల తర్వాత వచ్చే వసూళ్లన్నీ అదనపు లాభాలే అని నిర్మాతలు లెక్కలు వేస్తున్నట్లు సమాచారం.

కామెడీ టైమింగ్‌తో..

శ్రీవిష్ణు  కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో దిట్ట. ఆయన నటించిన గత చిత్రాలైన 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన సినిమా అంటే వెనుకాడకుండా పెట్టుబడి పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. 'విష్ణు విన్యాసం' టీజర్, పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం, సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది. ఇందులో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్‌ వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు రథన్‌ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన 'ఆయ్' మూవీ ఫేమ్ నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దర్శకడు యదునాథ్ మారుతీ రావు ఈ చిత్రాన్ని ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు.  సుమంత్ నాయుడు జి ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.  థియేటర్లలో విష్ణు చేయబోయే విన్యాసాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.