తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 13 బిల్లులకు సభ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 13 బిల్లులకు సభ ఆమోదం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఐదురోజుల పాటు శీతకాల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. శాసన సభలో వివిధ అంశాలపై 40 గంటల 40 నిమిషాల పాటు చర్చ జరిగింది. కృష్ణా జలాలు, హిల్ట్ పాలసీ, మూసీ సుందీకరణ, ఉపాధి హామీ పథకం పేరు మార్పు తదితర అంశాలపై సభ్యులు డిస్కస్ చేశారు. ఈ సమావేశాల్లో 13 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభలో 66 మంది సభ్యులు మాట్లాడినట్లు స్పీకర్ ప్రకటించారు.

కృష్ణా జలాలపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. మరోవైపు తమకు స్పీకర్‌‌‌‌‌‌‌‌ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సెషన్ మొత్తం బాయ్ కాట్ చేసింది. 

  • మొత్తం ఐదు రోజులు నడిచిన అసెంబ్లీ
  • పని గంటలు - 40 గంటల 45 నిమిషాలు 
  • ఆమోదం పొందిన బిల్లులు - 13
  • సభ చేసిన తీర్మానాలు - 2
  • స్వల్ప కాలిక చర్చలు - 4

  •