కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్క వదులుకోం: మంత్రి ఉత్తమ్ 

కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్క వదులుకోం: మంత్రి ఉత్తమ్ 

ములుగు: కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోకుండా తెలంగాణ హక్కులు కాపాడతామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం (ఫిబ్రవరి 22) ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని దేవాదుల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. 2027నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. 5 లక్షల పైచిలుకు ఆయకట్టుకు నీరందిస్తామని చెప్పారు. రెండేళ్లలో గోదావరి నది బేసిన్‎లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. గోదావరి బేసిన్‎లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పంటలు పండాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ 2026, జూన్ 2వరకు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.