భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త ఫోన్, ట్యాబ్లెట్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త ఫోన్, ట్యాబ్లెట్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ అయిన రెడ్‌మి కొత్త ఏడాది సందర్భంగా రెండు అదిరిపోయే ఫోన్లను విడుదల చేసింది. దింతో రెడ్‌మి నోట్ 15, రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో టాబ్లెట్‌లు ఇప్పుడు భారత మార్కెట్లోకి వచ్చాయి. ఇవి మంచి డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ ఫీచర్లతో బడ్జెట్ ధరకే లభిస్తున్నాయి. 

రెడ్‌మి నోట్ 15 5G 
ఈ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీని వెనుక భాగంలో గుండ్రటి ఆకారంలో పెద్ద కెమెరా సెటప్ ఉంది. 6.77 అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ వాడారు. దీనివల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. వెనుక వైపు 108 MP మెయిన్ కెమెరా ఫోటోలు షేక్ అవ్వకుండా (OIS) తీస్తుంది. 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో పాటు 30fps వద్ద 4K వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 

ముందు వైపు సెల్ఫీల కోసం 20 MP కెమెరా ఇచ్చారు. 5,520mAh పెద్ద బ్యాటరీ దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లోనే వస్తుంది. వెనుక ప్యానెల్ ప్లాస్టిక్‌తో తయారు చేసి టెక్స్చర్డ్ డిజైన్‌తో వస్తుంది. 8GB/128GB వేరియంట్ ధర రూ. 22వేల999, 8GB/256GB వేరియంట్ ధర రూ. 24వేల999. 9 జనవరి 2026 నుండి సేల్స్  మొదలవుతాయి. బ్యాంకు ఆఫర్ల ద్వారా ధర రూ. 3వేల వరకు తగ్గే అవకాశం ఉంది.

రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూడాలనుకునే వారికి, గేమింగ్ ఆడేవారికి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G  చాలా బాగుంటుంది. దీనికి 12.1 అంగుళాల పెద్ద QHD+ స్క్రీన్ ఇందులో 4 స్పీకర్లు ఉండటం వల్ల సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ ఉంది. ఇంకా 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఏకంగా 12,000mAh బ్యాటరీ ఇచ్చారు దింతో   ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా కాలం వస్తుంది.  

8GB/128GB ధర రూ. 24 వేల 999. 8GB/128GB 5G ధర  రూ. 27,999, 8GB/256GB రూ. 29,999. 12 జనవరి  2026 నుండి సేల్స్ మొదలవుతాయి. బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ. 2,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 610 గ్రాముల బరువు, 7.5mm మందం  ఉంటుంది. ప్యాడ్ 2 ప్రో 5G 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీకు బాక్స్‌లోనే  ఛార్జర్‌ వస్తుంది.