గుడ్ న్యూస్.. తెలుగు యూనివర్సిటీలో ఫుల్ టైమ్ మ్యాజిక్ కోర్సులు.. ఎప్పటి నుంచంటే..

గుడ్ న్యూస్.. తెలుగు యూనివర్సిటీలో ఫుల్ టైమ్ మ్యాజిక్ కోర్సులు.. ఎప్పటి నుంచంటే..

కళలకు సంబంధించిన కోర్సులకు పెట్టింది పేరయిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ (గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ).. మరో కొత్త కోర్సును ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే జానపద కళలు, సంప్రదాయ నృత్యం, సంప్రదాయ సంగీతం, డైరెక్షన్, యాక్టింగ్.. ఇలా వివిధ కళారూపాలకు సంబంధించిన కోర్సులు అందించి ప్రత్యేకత చాటుకున్న యూనివర్సిటీలో.. కొత్తగా మ్యాజిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు యూనివర్సిటీ వీసీ ప్రకటించారు. 

మంగళవారం (ఫిబ్రవరి 24) హైదరాబాద్ నాంపల్లిలోని ఎన్టీఆర్ కళామందిర్ లో జరుగుతున్న నేషనల్ మెజీషియన్స్ డే వేడుక సందర్భంగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మ్యాజిక్ కరికులమ్ ప్రవేశ పెట్టనున్నట్లు వీసీ ఆచార్య వెలిదండ నిత్యానంద రావు ప్రకటించారు. 

మ్యాజిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా జరుగుతున్న ప్రదర్శనల సందర్భంగా.. అభ్యర్థులకు డిప్లొమా సర్టిఫికెట్లు అందించారు. యూనివర్సిటీ గత 9 ఏళ్లుగా మ్యాజిక్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. అయితే ఫుల్ టైమ్ కోర్సు వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్నట్లు వీసీ ప్రకటించారు. తమ యూనివర్సిటీలో పట్టా పొందిన అభ్యర్థులు ప్రొఫెషనల్ పర్ఫార్మర్లుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు తెలిపారు. 

ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు పిసి సొర్కార్ సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కోర్స్ డైరెక్టర్, మెజీషియన్ సామల వేను. మ్యాజిక్ అనేది మూఢ విశ్వాసం కాదని.. ఇది ఒక కళ అని చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

►ALSO READ | తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం అందిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

అంతకు ముందు కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మ్యాజిక్ కు ఎంతో సాంస్కృతిక ప్రత్యేకత ఉందన్నారు. మ్యాజిక్ అనే కళ.. యువతలో సృజనాత్మకత (creativity), మేధోపరమైన అభివృద్ధిని (intellectual development) పెంపొందిస్తుందని కొనియాడారు.

స్కూల్, కాలేజీ డ్రాపౌట్స్, గ్రామీణ ప్రాంత యువకులు కోర్సులో చేరి.. ఆ తర్వాత ప్రొఫెషనల్ మెజీషియన్లుగా డెవలప్ అవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. తమ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో, తమ కమ్యూనిటీల్లో మూఢ విశ్వాసాలపై అవగాహన పెంచుతున్నారని తెలిపారు.