తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం అందిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం అందిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో రాబోయే రోజుల్లో 120 కొత్త అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ  విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం అందిస్తామని చెప్పారు. మంగళవారం (ఫిబ్రవరి 24) రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన ఇండియా స్కిల్ రీజనల్ కాంపిటిషన్ 2025-26  ముగింపు వేడుకల్లో  ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి.. యువత విద్యతో పాటు ఎదో ఒక కొత్త రంగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. 

ఈ కాంపిటిషన్ లో సౌత్ ఇండియా లోని 5 రాష్ట్రాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి,లక్షద్వీప్ లకు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ తో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. 3డి డిజిటల్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోనమస్ మొబైల్ రోబోటిక్, బ్యూటీతెరఫీ, బ్రిక్ లేయింగ్, కేబినెట్ మేకింగ్, కార్పెంటరీ  విభాగాల్లో ప్రతిభ కనబర్చిన సౌత్ ఇండియా విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందించారు మంత్రి వివేక్. 

మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్:

  • ప్రతిభావంతులైన యువతను చూసినప్పుడు మన దేశ భవిష్యత్తుపై అపారమైన విశ్వాసం కలుగుతోంది
  • సౌత్ ఇండియా పోటీలలో మొత్తం 63 నైపుణ్య విభాగాలు పాల్గొన్నాయి. 350కి పైగా పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
  • ముఖ్యంగా మహిళల పాల్గొనడం ఎంతో ప్రోత్సాహకరం. 123 మంది యువతులు ఈ ప్రాంతీయ పోటీలో పాల్గొన్నారు.
  • సంప్రదాయంగా పురుషాధిక్యంగా భావించే కేబినెట్ మేకింగ్, కార్పెంట్రీ, ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్స్, ప్లంబింగ్, హీటింగ్ వంటి రంగాల్లో 20 మంది మహిళలు పోటీ చేయడం సామాజిక మార్పుకు నిదర్శనం. 
  • తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి ఒక శాఖ మాత్రమే కాదు... అభివృద్ధి వ్యూహం
  • గత కొన్ని సంవత్సరాలుగా ఐటీఐలు, శిక్షణా మౌలిక వసతులను ఆధునీకరించడానికి కృషి చేస్తున్నాం
  •  పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా మారుస్తున్నం 
  • ఆధునిక యంత్రాలు, డిజిటల్ పరికరాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికలు అందిస్తున్నాం. 
  • ఇవి ఇక సంప్రదాయ సంస్థలు కావు..  ఇవి ఇకనుంచి ప్రతిభా కేంద్రాలు
  • తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) విద్యా సంస్థలు,  పరిశ్రమల మధ్య వారధిగా కీలక పాత్ర పోషిస్తోంది. 
  • కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కరణ సామర్థ్యం, డిజిటల్ లిటరసీ వంటి అంశాలు ఇప్పుడు శిక్షణలో భాగమయ్యాయి.
  • హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్ రంగాలలో గ్లోబల్ కేంద్రంగా ఉంది. 
  • అందుకే AI, రోబోటిక్స్, మెచాట్రానిక్స్, డేటా అనలిటిక్స్, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం
  • నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కోసం కాదు – సాధికారత కోసం
  • ఒక యువకుడు లేదా యువతి నైపుణ్యం నేర్చుకున్నప్పుడు వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. గౌరవం వస్తుంది.. స్వతంత్రత వస్తుంది.. 
  • నైపుణ్యం ఉన్న వారు అవకాశాల కోసం ఎదురుచూడరు, వారు అవకాశాలను సృష్టిస్తారు.

►ALSO READ | ఐడియా అదిరింది గురూజీ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో.. రోజూ కొబ్బరి లడ్డు అందిస్తున్న హెడ్ మాస్టర్