రూ.8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్.. హోటల్ లో కరెంట్ షాక్.. విధి రాత ఇలా ఉంటే.. !

రూ.8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్.. హోటల్ లో కరెంట్ షాక్.. విధి రాత ఇలా ఉంటే.. !

జార్ఖండ్ రాష్ట్రంలో కూలిపోయిన ఎయిర్ అంబులెన్స్ విషాధం వెనక అసలు వాస్తవాలు అందర్నీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఓ చిన్న ప్రమాదం.. ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలను తీసింది.. జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ బుక్ చేయటానికి కారణం ఏంటీ.. దీని వెనక ఏం జరిగింది అనేది బంధువులు చెబుతున్న మాటలు.. అందర్నీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్ రాష్ట్రం చాంద్వా అనే చిన్న గ్రామం. గ్రామంలోనే సంజయ్ అనే వ్యక్తి తన కుటుంబంతో హాయిగా జీవిస్తున్నాడు. 2026, ఫిబ్రవరి 23వ తేదీ అంటే.. సోమవారం చాంద్వా గ్రామంలోని ఓ చిన్న హోటల్ లో టిఫిన్ చేయటానికి వెళ్లాడు. ఆ చిన్న హోటల్ లో కరెంట్ షాక్.. తీవ్రంగా గాయపడ్డాడు సంజయ్. స్థానికంగా చికిత్స తర్వాత.. సంజయ్ ను రాంచీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేసిన డాక్టర్లు.. అంతర్గతంగా గాయాలు తీవ్రంగా ఉన్నాయి.. మెరుగైన వైద్యం అవసరం అని చెప్పేశారు డాక్టర్లు. కుటుంబం  మొత్తానికి సంజయ్ ఒక్కడే జీవనాధారం. 

ఈ క్రమంలోనే సంజయ్ ను ఎలాగైనా కాపాడుకోవాలని భావించిన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు... ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో మెరుగైన చికిత్స చేయించాలని నిర్ణయించారు. రాంచీ నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 13 వందల కిలోమీటర్లు.. ఒక రోజు పడుతుంది.. ఈ క్రమంలోనే ఎయిర్ అంబులెన్స్ బెస్ట్ అని భావించారు. దీనికి 8 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు నిర్వాహకులు.

చేతిలో అంత డబ్బు లేకపోయినా.. సంజయ్ కుటుంబ సభ్యులు అప్పులు చేసి మరీ 8 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ వెంటనే గాయపడిన సంజయ్.. ఆయన భార్య అర్చన, బంధువు ధృవ్ తోపాటు ఓ డాక్టర్.. మరో నర్సు ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. ఈ ఐదుగురితోపాటు ఇద్దరు పైలెట్లతో రాంచీ నుంచి ఎయిర్ అంబులెన్స్ బయలుదేరింది. 

గాల్లోకి లేచిన ఎయిర్ అంబులెన్స్.. కొద్ది దూరం వెళ్లగానే కూలిపోయింది. ఎయిర్ అంబులెన్స్ లోని ఏడుగురు చనిపోయారు. బీచ్ క్రాఫ్ట్ సీ90 మోడల్ కు చెందిన ఈ ఛార్టర్ ఫ్లయిట్.. ఢిల్లీకి చెందిన రెడ్ బర్డ్ ఎయిర్ వేర్ అనే కంపెనీ నిర్వహిస్తుంది. 

సంజయ్ ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో.. 8 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ ఎయిర్ అంబులెన్స్ బుక్ చేసుకున్నామని.. అయినా ప్రాణాలు దక్కకపోగానే.. అతని భార్య అర్చన, బంధువు ధృవను కూడా కోల్పోయాం అంటూ అతని తమ్ముడు అజయ్ కన్నీళ్లతో చెబుతున్నాడు. 

జార్ఖండ్ లోని చాంద్వా గ్రామంలో విషాధం నెలకొంది. సంజయ్ చాలా మంచి వాడని.. అందరితో బాగుంటాడని.. అతన్ని కాపాడుకోవటం కోసం వారి కుటుంబం డబ్బులు అడిగిన వెంటనే.. అందరం సర్దుబాటు చేశామని.. ఇప్పుడు అదే వారి ప్రాణాలను తీసిందంటూ బోరుమంటున్నారు. 

రాంచీలోనే చికిత్స చేయించినట్లయితే.. అతని భార్య అర్చన ప్రాణాలు అయినా దక్కేవని.. ధృవ్ బతికేవాడేమో అంటూ జరిగిన ఘటనను గుర్తు చేసుకుని మరీ కన్నీటిపర్యంతం అవుతున్నాయి. 

ఈ ఘటన చాలా విచిత్రంగా ఉంది.. ప్రాణాలను కాపాడటం కోసం చేసిన ప్రయత్నాల్లో.. తన భార్యను.. తన బంధువును కూడా కోల్పోయాడు. ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం కావటం సంచలనంగా మారింది. ఇటీవల వరసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.