ఇండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమిట్–2026 లో ఓ 8 ఏళ్ల బుడ్డోడు ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. సమిట్ లోనే అతి తక్కువ వయసున్న స్పీకర్ గా రికార్డు సృష్టించి.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈవో ఆల్ట్ మన్ లను ఆకట్టుకున్నాడు. దీంతో ఎవరీ బుడతడు.. ఎవరీ రణ్ వీర్ సచ్ దేవా..? అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఈ ఎనిమిదేళ్ల రణ్ వీర్ సచ్ దేవా ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. భారత ప్రాచీన తత్వశాస్త్రాన్ని మోడ్రన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తను ఎలా లింక్ చేస్తున్నాడో తన ప్రసంగంలో వివరించాడు.
ఏఐ సమిట్ లో ఇండియా తరఫున అత్యంత చిన్న వయసులో ప్రసంగించేందుకు వచ్చిన వక్తను నేను. అధునాతన సాంకేతికత వ్యవస్థకు ప్రాచీన భారత ఫిలాసఫీని లింక్ చేయడంపై నేను మాట్లాడుతున్నాను.. అనే సరికి సమిట్ అంతా ఒక్కసరాగి అప్లాజ్ వచ్చింది. బుడతడి స్పీకింగ్ స్కిల్స్ కు ఫిదా అయిపోయారు.
ఇండియా ఏఐ ని ఎలా నిర్మిస్తోంది.. ఏఐ మోడల్ ను నేను ఎలా ఉపయోగిస్తున్నానో షేర్ చేస్తున్నాను.. ఇండియన్ జీడీపీకి ఏఐ కంట్రిబ్యూషన్ ఏంటో షేర్ చేస్తున్నానని చాలా ధైర్యంగా స్పీచ్ ఇచ్చి అందరి మనసులు గెలుచుకున్నాడు.
టెక్ టైటాన్స్‌ని ఆకట్టుకుంటున్న రణ్ వీర్ సచ్‌దేవా:
రణ్‌వీర్ ట్యాలెంట్ సమిట్ కు వచ్చిన ప్రముఖులతో ఫేస్ టు ఫేస్ కలుసుకునేలా చేసింది. ఈ సమ్మిట్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్‌ఏఐకి చెందిన సామ్ ఆల్ట్‌మన్‌లను కలవటం గొప్పవిషయమేగా మరి. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు రణవీర్ .
►ALSO READ | రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాలన్నా పేరెంట్స్‌కు చెప్పాల్సిందే..వివాహ నిబంధనల్లో మార్పులకు గుజరాత్ సర్కారు సిద్ధం
లాస్ట్ ఇయర్ జెనీవాలో జరిగిన AI ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్‌లో సచ్‌దేవా సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సెక్రటరీ జనరల్ డోరీన్ బోగ్డాన్-మార్టిన్‌లను కూడా కలవడం విశేషం. 2024లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ను కలిశాడు.
అతి చిన్న వయసులో ప్రపంచలోనే పాపులర్ ఫిగర్స్, టెక్ గెయింట్స్ ను కలుస్తూ రణ్ వీర్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే 2023లో ఆపిల్ CEO టిమ్ కుక్‌తో జరిగింది. 2023లో ఢిల్లీ స్టోర్ ప్రారంభోత్సవం కోసం న్యూఢిల్లీ వచ్చిన కుక్ తో ముచ్చటించిన ఈ బాల మేధావి.. తన కోడింగ్ నైపుణ్యాలను వన్-ఆన్-వన్ సెషన్‌లో ప్రదర్శించాడు. ఆ సమయంలో, అతనికి 5 సంవత్సరాలే అంటే ఆశ్చర్యపోక తప్పదు. మూడు సంవత్సరాల వయస్సు నుంచే కోడింగ్ చేస్తుండటం ఇతడి ట్యాలెంట్ కు మరో నిదర్శనం.
వీటికి తోడు ఎన్నో అవార్డ్స్ ను గెలుచుకున్నాడు రన్ వీర్. 2022 గ్లోబల్ రీడింగ్ ఛాలెంజ్‌లో "సూపర్ ప్రెజెంటర్"గా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 6 సంవత్సరాల వయస్సులో TEDx ప్రసతంగా చేసి అతిచిన్న వయసులో స్పీకర్ TEDx గా రికార్డుకెక్కాడు. చిన్న బుర్రలో ఎంత దాచుకున్నాడో కానీ.. కార్టూన్స్ చూసే వయసులోనే టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతను మార్స్ అన్వేషణ కోసం ఒక ప్రోటోటైప్ రాకెట్ షిప్‌ను సృష్టించినట్లు కూడా చెప్పాడు. అంతేకాదు NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ నుంచి దానికి గుర్తింపు లభించినట్లు పేర్కొన్నాడు.
