ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని ఎన్నో అధ్యయనాలు వచ్చాయి. ఫిట్నెస్ కోసం ప్రత్యేక డైట్, జిమ్, గేమ్స్ ఇలా.. ఎన్నో రెకమెండేషన్స్ చెప్పాయి. అయితే అన్నింటికంటే సులువైనది.. ఉత్తమమైన మార్గం నడక అని చాలా స్టడీస్ రివీల్ చేశాయి. అందులో రోజుకు కనీసం 10 వేల గంటలు నడిస్తే చాలు.. రోగాలనుంచి బాడీని కాపాడుకోవచ్చు. అరోగ్యంగా ఉండవచ్చుననే ఒక స్టడీని అందరూ ఫాలో అవుతున్నారు.
10 వేల అడుగులు అంటే.. దాదాపు 8 కిలోమీటర్లు. గంటన్నర నడక. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో గంటన్నర సమయం కేటాయించడమా.. 8 కిలోమీటర్లు నడవడమా.. ఇది అయ్యేపని కాదులే అన్నట్లు చాలా మంది భావిస్తూవస్తున్నారు. కానీ .. రీసెంట్ స్టడీ ఒకటి.. అంతకూడా అవసరం లేదు.. కేవలం 7 వేల అడుగులు చాలు అని చెప్తోంది. ఆరోగ్యంగా ఉండేందుకు 7 వేల అడుగులు.. అంటే దాదాపు 5 కిలోమీటర్లు.. గంట నడక చాలు అని మరో అధ్యయనం వెల్లడించింది.
ఇంత తేడా ఎందుకు..?
ఎంతో కాలంగా వస్తున్న 10000 అడుగుల థియారీని కాదని కొత్త స్టడీ 7 వేల స్టెప్స్ చాలని అనటం ఏంటనే డౌట్ రావచ్చు. దీనికి కారణం.. 10 స్టెప్స్ నడక అనేది శాస్త్రీయంగా ప్రూవ్ అయ్యింది కాదు. 1960లలో మార్కెటింగ్ బెంచ్ మార్క్ గా ఇది పాపులారిటీలోకి వచ్చింది. కాని మెడికల్ రెకమెండేషన్ కాదు. ఇప్పుడు ఎంతో రీసర్చ్ జరుగుతోంది. అందులో భాగంగానే కొత్త స్టడీ వెలుగులోకి వచ్చింది.
లాన్సెట్ పబ్లిక్ హెల్త్ (The Lancet Public Health) రీసర్చ్ ప్రకారం.. రోజుకు 7 వేల అడుగుల నడక చాలా హెల్త్ రిస్క్ ల నుంచి కాపాడుతుందని పేర్కొంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి సమస్య, డయాబెటిస్, ముందస్తు మరణాలు.. ఇలా చాలా సమస్యలనుంచి బయటపడేస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది.
►ALSO READ | Beauty House: ఇంటి మొక్కలు..ఇండోర్ లో అందమైన ప్లాంట్స్.. అందమే కాదు.. ఆరోగ్యం కూడా..!
అయితే నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) వంటి చాలా స్టడీస్.. రోజుకు కనీసం 4 నుంచి 5 వేల అడుగులు నడిచినా.. వివిధ కారణాలతో సంభవించే మరణాల నుంచి కాపాడుకోవచ్చునని చెబుతున్నాయి. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ (AHA) ప్రకారం.. కనీసం 5 వందల నుంచి వెయ్యి అడుగులు వేసినా.. ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని.. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులనుంచి కాపాడుతుందని పేర్కొంది. ఎలాంటి యాక్టివిటీ చేయకపోవడం కంటే.. కనీసం మూవ్ మెంట్ ఉంటే గుండె ఫెయిల్యూర్, హార్ట్ స్ట్రోక్ నుంచి కాపాడుకోవచ్చునని అధ్యయనంలో తేలింది.
ఎన్ని అడుగులకు ఏయే లాభాలు:
రోజుకు 2,300–3,800 అడుగులు నడవడం వలన అకాల మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.
రోజుకు 4,000 అడుగులు వేస్తే.. గుండె సమస్యలతో వచ్చే మరణాల తగ్గుదల.. ఇతర అనారోగ్య సమస్యలనుంచి బయటపడటంలో తోడ్పడుతుంది.
7,000 అడుగులు నడిస్తే అకాల మరణాలు సంభవించడం చాలా తక్కవ అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, జ్ఞాపకశక్తి సమస్య మొదలైన ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం.
రోజుకు 8,000–10,000 మెట్లు ఎక్కితే.. ఆయుష్షు పెరగటంలో తోడ్పడుతుంది.
రోజుకు 1,000 అడుగులు నడిస్తే.. అకాల మరణాలను దాదాపు 15% తగ్గిస్తుంది. వయసు పెరుగుతున్నా.. గుండె జబ్బులతో వచ్చే మృతి సమస్య నుంచి బయటపడేస్తుంది.
అంతగా నడవలేనప్పుడు ఏం చేయాలి..?
- భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం
- ఫోన్ కాల్స్ సమయంలో నడవడం
- లిఫ్ట్‌లకు బదులుగా మెట్లను ఉపయోగించడం
- వేచి ఉన్నప్పుడు లేదా ఆడియో వింటున్నప్పుడు నడవడం
- ఎలాంటి కదలిక లేకుండా ఉండేకంటే.. కనీసం బాడీ మూవ్ మెంట్ ఉండేలా చూసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు.
