సహజ వనరులను సంరక్షించాలి : తెల్లాపూర్ నైబర్ హుడ్ ప్రెసిడెంట్ రమణ

సహజ వనరులను సంరక్షించాలి : తెల్లాపూర్ నైబర్ హుడ్ ప్రెసిడెంట్ రమణ
  •     తెల్లాపూర్​ నైబర్​ హుడ్ ప్రెసిడెంట్ రమణ

రామచంద్రాపురం, వెలుగు: సహజ వనరులైన చెరువులు, కుంటలకు పరిరక్షించుకొని వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందకు రావాలని తెల్లాపూర్​ నైబర్​ హుడ్ అసోసియేషన్​ అధ్యక్షుడు రమణ పిలుపునిచ్చారు. శనివారం జీహెచ్​ఎంసీ సిబ్బంది సహకారంతో నైబర్​ హుడ్​ సభ్యులు, స్థానిక ప్రజలు తెల్లాపూర్​ మేళ్ల చెరువును శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు తేడా లేకుండా చెత్తా చెదారం ఎత్తి పోశారు. 

రమణ మాట్లాడుతూ ఇప్పటికైనా చెరువులను పట్టించుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నైబర్​ హుడ్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో మేళ్ల చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్​ఎంసీ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేష్​ సభ్యులు దీప్తి రెడ్డి, రవి కిరణ్, రామ్​ కుమార్, నరేందర్​ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.