మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 22) మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్ జీ లొంగిపోయారు. తెలంగాణ ఎస్ ఐ బీ ముందు మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ సహా పలువురు మావోయిస్టులు లొంగిపోయారు.
తెలంగాణ పోలీసుల కీలక ఆపరేషన్ లో దేవ్ జీ తో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిరుపతి లొంగిపోవడం పార్టీకి పెద్ద దెబ్బగా చెబుతున్నారు విశ్లేషకులు. అదే విధంగా కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి కూడా లొంగిపోవడం గమనార్హం. ఆదివారం జరిగిన లొంగుబుకు సంబంధించిన వివరాలను తెలంగాణ పోలీసులు అధికారిక ప్రకటన చేయనున్నారు.
- కుమ్రంబీమ్ జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టు నాయకుడు దేవ్ జీ
- లొంగుబాటును ధృవీకరించిన పోలీసులు
- మహరాష్ట్ర గడ్చిరోలి, తెలంగాణ సరిహద్దులో లొంగిపోయినట్లుగా సమాచారం
