- మంత్రి దామోదర రాజనర్సింహ
జోగిపేట, వెలుగు: సింగూర్ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, రైతుల కోరిక మేరకు మరో లక్ష ఎకరాల సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం అందోల్ మండలంలోని పోసానిపేట్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఆర్ఆర్డీ డిస్టలరీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్య ఆథితిగా హాజరయ్యారు. ఎండీ కొండల నిపుణ్ రెడ్డితో కలిసి ఫ్యాక్టరీ ప్రారంబించారు.
అనంతరం మాట్లాడుతూ.. నిరుద్యోగులకు, మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు.
అందోల్ నియోజక వర్గాన్ని విద్యా, వైద్య రంగాల హబ్ గా మారుస్తానన్నారు. కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కంపెనీ డైరెక్టర్ త్రిష, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, నర్సిరెడ్డి, సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు పాల్గొన్నారు.
