లవర్స్కు షాక్.. ఇకపై పేరెంట్స్కు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేరు..!

లవర్స్కు షాక్.. ఇకపై పేరెంట్స్కు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేరు..!

ఇది నిజంగా లవర్స్ కు షాకింగ్ న్యూసే. లేచిపోయి పెళ్లి చేసుకోవడం.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం మున్ముందు అంత సులువు కాదు. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. పేరెంట్స్ అనుమతి లేకుండా మీరు దంపతులు కాలేరు. ఇకపై రిజిస్టర్ మ్యారేజ్ కు పేరెంట్స్ అనుమతిని తప్పనిసరి చేస్తూ తీసుకొస్తున్న నిబంధనే అందుకు కారణం.

గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రేమికుల దృష్టిలో సంచలనంగా మారింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సిస్టంలో తల్లిదండ్రుల పాత్రను తప్పనిసరి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాంటి నిబంధనలు తీసుకొస్తున్నట్లు డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ శుక్రవారం (ఫిబ్రవరి 20) ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్, 2006 లో మార్పులు తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. లవ్ మ్యారేజెస్, లేచిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి వివాహాలకు సంబంధించి.. జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు.. అమ్మాయిలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. స్వచ్ఛమైన ప్రేమ పెళ్లిళ్లకు తాము వ్యతిరేకం కాదని.. ప్రేమ పేరుతో యువతులను మోసం చేయడం, దోపిడీకి గురిచేయడాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు:

గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్, 2006  కు కీలక సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కు  ఈ కింది సమాచారం కావాల్సి ఉంటుంది.

  • తల్లిదండ్రులకు పెళ్ళి గురించి సమాచారం ఇచ్చినట్లు డిక్లేరేషన్ ఇవ్వాలి.
  • పేరెంట్స్ పేర్లు, అడ్రస్, ఆధార్ కార్డులు, కాంటాక్ట్ డీటైల్స్ ఇవ్వాలి
  • సాక్షులు కూడా ఫోటోలు, ఆధార్ కార్డు డీటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది
  • ఈ పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్ ను అసిస్టెంట్ రిజిస్ట్రార్ కు సమర్పించాల్సి ఉంటుంది.
  • ఇచ్చిన వివరాలు సరైనవని భావిస్తే.. 10 రోజులలో తల్లిదండ్రులకు రిజిస్ట్రార్ సమాచారం అందిస్తారు
  • ఆ తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్  అప్లికేషన్ ను జిల్లా రిజిస్ట్రార్ కు పంపిస్తారు. 
  • ఇచ్చిన వివరాలు సరైనవిగా భావిస్తే 30 రోజుల తర్వాత వివాహం రిజిస్ట్రేషన్ అవుతుంది. 
  • ఈ వివరాలతో కూడిన డాక్యుమెంట్ ను ప్రభుత్వ పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు. 
  • అప్లికేషన్ చేసుకున్న 40 రోజుల తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు.

ఈ ప్రక్రియలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు ఆధార్ కార్డ్స్, బర్త్ సర్టిఫికేట్స్, స్కూల్ టీసీ, ఫోటోలు, పెళ్లి పత్రిక మొదలైనవి సమకూర్చాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఈ కొత్త ప్రక్రియలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెవెన్యూ అధికారుల నుంచి ప్రభుత్వ కోర్టులకు మార్పిడి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.