సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై నిఘా : సీపీ సాయిచైతన్య

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై నిఘా : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​, వెలుగు:  ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని,  సోషల్​ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. శనివారం ఆయన తన ఆఫీస్​లో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.

రంజాన్​ పండగ కోసం మసీదుల్లో నమాజ్​కు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్​ కంట్రోలింగ్​ చేస్తున్నామని, పుకార్లు నమ్మొద్దన్నారు. తమ వర్గాల్లో అవగాహన పెంచడానికి మత పెద్దలు చొరవ చూపాలన్నారు.  అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా ఏసీపీలు ప్రకాశ్, శ్రీనివాస్, వెంకట్​రెడ్డి, మస్తాన్​అలీ, ఎస్బీ ఇన్​స్పెక్టర్ శ్రీశైలం తదితరులు ఉన్నారు.

23న యథావిధిగా పోలీస్​ ప్రజావాణి..

ప్రతి సోమవారం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నిర్వహించే పోలీస్​ ప్రజావాణి 23న కూడా నిర్వహిస్తామని సీపీ సాయిచైతన్య తెలిపారు.  గత రెండువారాల్లో 134 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు నమోదు చేయగా, జడ్జి రూ.12.10 లక్షల జరిమానా విధించారని వివరించారు.