Maa Inti Bangaaram: ‘‘మీరు చూస్తా ఉండండి.. మీ అందరితో కలిసిపోతా’’.. సంక్రాంతికి సామ్ సర్ప్రైజ్

Maa Inti Bangaaram: ‘‘మీరు చూస్తా ఉండండి.. మీ అందరితో కలిసిపోతా’’.. సంక్రాంతికి సామ్ సర్ప్రైజ్

క్రేజీ బ్యూటీ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం అనంతరం పూర్తిగా సినిమా పనుల్లో బిజీగా మారింది. ప్రస్తుతం సామ్ తన నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ను పూర్తి చేయడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ‘ఓ బేబీ’ తర్వాత తన స్నేహితురాలు, దర్శకురాలు నందిని రెడ్డితో మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే సమంత తాజాగా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఓ క్రేజీ అప్డేట్‌ను అభిమానులతో పంచుకుని మరింత  ఆసక్తిని పెంచింది.

సంక్రాంతి సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ నుంచి సమంత ఓ క్రేజీ అప్డేట్‌ను పంచుకుంది. శుక్రవారం, జనవరి 9 ఉదయం 10 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా “మీరు చూస్తా ఉండండి.. ‘మా ఇంటి బంగారం’ మీ అందరితో కలిసిపోతుంది”అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జోడించి మరింత ఆసక్తిని పెంచింది.

‘మా ఇంటి బంగారం’మూవీ గురించి:

సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా  మూవింగ్ పిక్చర్స్‌‌’ బ్యానర్‌‌‌‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కో ప్రొడ్యూసర్స్. ఈ సినిమా కోసం ఎలాంటి డూప్ సహాయం లేకుండా యాక్షన్‌‌ సీన్స్‌‌లో నటిస్తోందట సమంత.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో బస్సులో నిలబడి ఇంటెన్స్ యాంగిల్ లో చూస్తున్న సామ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎయిటీస్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తున్న ఈ క్రైమ్‌‌ థ్రిల్లర్‌‌‌‌లో  సమంత చేసిన యాక్షన్ సీన్స్‌‌ సినిమాకు స్పెషల్‌‌ అట్రాక్షన్‌‌ గా నిలుస్తాయని మేకర్స్‌‌ భావిస్తున్నారు.

అయితే, ది ఫ్యామిలీ మ్యాన్‌‌ 2, సిటాడెల్‌‌ లాంటి వెబ్‌‌ సిరీస్‌‌లతో తాను యాక్షన్‌‌ సీన్స్‌‌లోనూ మెప్పించగలనని ఆమె ప్రూవ్ చేసుకుంది. అయితే ఈసారి చీరకట్టులో స్టంట్స్‌‌ చేస్తుండడం విశేషం. అంతేకాదు తన కెరీర్‌‌‌‌లోనే ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పాత్ర ఇదేనని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ లీ విటేకర్ దీనికి స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.

బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సమంతతో నటించడం చాలా ఈజీ అని, తమ ఆన్‌‌స్క్రీన్‌‌ కెమిస్ట్రీ ఆకట్టుకోనుందని గుల్షన్‌‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.