Shivaji Laya: హిట్ కాంబినేషన్ రిపీట్.. శివాజీ–లయ కాంబినేషన్‌పై భారీ అంచనాలు.. 

 Shivaji Laya: హిట్ కాంబినేషన్ రిపీట్.. శివాజీ–లయ కాంబినేషన్‌పై భారీ అంచనాలు.. 

శివాజీ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తూ నిర్మించిన క్రైమ్‌‌ కామెడీ ఫ్యామిలీ థిల్లర్‌‌ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. శివాజీకి జంటగా లయ నటించారు. బన్నీ వాస్‌‌, వంశీ నందిపాటి మార్చి 6న థియేటర్స్‌‌లో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌మీట్‌‌లో శివాజీ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ సినిమా చూసిన వాళ్లంతా హిలేరియస్‌‌గా నవ్వుకున్నారు. ఓ మంచి సినిమా, అందరికి నచ్చే సినిమా తీశానని ధైర్యంగా చెప్పగలను. అందరూ ప్రేమించి చేసిన సినిమా ఇది. అందరి ప్రేమను పొందుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.

లయ మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి థియేటర్‌‌లో సినిమాలు చూసిన అలవాటుతో ఓటీటీలోకి వస్తుంది అనగానే చిన్న అసంతృప్తి ఉండేది. కానీ థియేటర్స్‌‌లో రిలీజ్ అవడం ఆనందంగా  ఉంది. ఈ సినిమా నా సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌కు మంచి శ్రీకారం అవుతుందని నమ్ముతున్నా’ అని చెప్పారు.

క్రైమ్ థ్రిల్లర్‌‌ కాంబినేషన్‌‌లో ఫ్యామిలీ ఎమోషన్‌‌ ఉండే సినిమా ఇది’ అని బన్నీ వాస్‌‌ అన్నారు.  శివాజీ, లయ హిట్‌‌ కాంబినేషన్‌‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోందని,  థ్రిల్లర్‌‌ అండ్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌గా ఈ చిత్రం మెప్పిస్తుందనే నమ్మకముందని వంశీ నందిపాటి చెప్పారు.  ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు అలీ,  దర్శకుడు సుధీర్‌‌ శ్రీరామ్‌‌,  ఈటీవీ విన్‌‌ బిజినెస్‌‌ హెడ్‌‌ సాయికృష్ణ పాల్గొన్నారు.