‘మొదటి వందకోట్ల బొమ్మ కొట్టిన హీరో.. మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో’ అంటూ గురువారం క్రేజీ కాంబోను అనౌన్స్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తన కొత్త చిత్రంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నట్టు ప్రకటించాడు.
ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు లాంటి ఎంటర్‌టైనర్స్ తర్వాత వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి చేస్తున్న ఐదవ చిత్రమిది. అలాగే ‘పటాస్’తో తనకు దర్శకుడిగా ఫస్ట్ చాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్‌తో రూపొందిస్తున్న రెండో చిత్రం.
క్లీన్ అండ్ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తన మార్క్ హ్యూమర్, ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు అనిల్ రావిపూడి తెలియజేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.
వెంకీ మామ రియాక్షన్:
వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో ఐదో చిత్రమిది. తన దర్శకుడితో మరో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉందని, ప్రతిసారీ అనిల్ రావిపూడితో సినిమా అంటే సరదాగా పాజిటివిటీతో - స్వేఛ్ఛమైన వినోదంతో ఉంటుందని, ఈసారి తమతో నందమూరి కళ్యాణ్ రామ్ జాయిన్ కావడం స్పెషల్ అని వెంకటేష్ తెలిపారు.
Back again with my director @AnilRavipudi for #VenkyAnil5 🤗🤗🤗
— Venkatesh Daggubati (@VenkyMama) February 26, 2026
Every time we team up, it feels like coming back home full of fun, positivity, and pure entertainment! ❤️
Glad to have @NANDAMURIKALYAN join this journey making it special for all of us.. పండగకి కలుద్దాం!!… https://t.co/mCqMXCW10x
కళ్యాణ్ రామ్ రియాక్షన్:
'పటాస్' తర్వాత మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తుండటం ఆల్రెడీ స్పెషల్ ఫీలింగ్ వచ్చిందని, ఈసారి వెంకటేష్ గారితో కలిసి సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేయబోతున్నామని, షూటింగ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నానని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Reuniting with you after ‘పటాస్’ already feels special Anil 🤗
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) February 26, 2026
And this time, along with our dearest Victory @VenkyMama garu for a SUPERB ENTERTAINER 🔥🔥🔥
Can't wait to begin the shoot https://t.co/Y9IQADvDpN
