శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు జి నిర్మించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న క్రమంలో బుధవారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘విష్ణు విన్యాసం ఫస్ట్ హాఫ్ అంతా యూత్‌కి కనెక్ట్ అయితే, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. చివరికి ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇది కచ్చితంగా సూపర్ హిట్ సినిమా.
హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి రండి. హండ్రెడ్ పర్సెంట్ నవ్వుకుంటారు’ అని చెప్పాడు. శ్రీ విష్ణు నుంచి ప్రేక్షకులు కోరుకునేవన్నీ ఇందులో ఉంటాయని నయన్ సారిక చెప్పింది. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారని దర్శకుడు యదునాథ్ మారుతీ రావు చెప్పాడు.
నిర్మాతలు మాట్లాడుతూ ‘విష్ణు గారి విన్యాసాలు చాలా బాగుంటాయి. ఇందులో ఆయన టైమింగ్ మామూలుగా ఉండదు. యూత్, ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీస్‌తో కలిసి వెళ్లి చూడండి. అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు.
అందరినీ అలరించే సినిమా అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ రధన్ చెప్పాడు. అతిథులుగా హాజరైన నిర్మాతలు కేకే రాధా మోహన్, బెక్కం వేణుగోపాల్ బెస్ట్ విషెస్ చెప్పారు.
